తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ఏకలవ్య గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
గిరిజన విద్యార్ధులకు మెరుగైన విద్యా, ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో మొత్తం 1380 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్ల వారీగా సీట్లను కేటాయిస్తారు. పూర్తి వివరాలను ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో https://tserms.telangana.gov.in లో లభిస్తాయని గురుకుల విద్యాలయాల సంస్థ డైరెక్టర్ సీతాలక్ష్మీ తెలిపారు.
Download Complete Notification
0 comments:
Post a Comment