Bharat Rice: కిలో RS. 29కే వచ్చే భారత్‌ రైస్‌ను ఇలా కొనుగోలు చేయండి

Bharat Rice Kg 29 | కేంద్రం తీసుకువస్తున్న భారత్ రైస్ కిలో రూ.29కే అందించే పథకాన్ని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(NAFED), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF), కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు. ఈ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో తీసుకువచ్చారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వేదికల్లో విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా,  భారత్‌ రైస్‌కు అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.



ఇలా కొనుగోలు చేయొచ్చు..

ఈ భారత్ రైస్ కావాలనుకునేవారు https://www.nafedbazaar.com/product-tag/online-shopping లోకి వెళ్ళాలి. ఇక్కడ భారత రైస్ తో పాటు పప్పు, శనగపిండి వంటి ఇతర ఉత్పత్తులు కూడా ఉంటాయి. నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడే కాకుండా ఇతర ఈ కామర్స్ సైట్లలో నుంచి కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే సగానికి పైగా తక్కువ ధరకు బియ్యం లభిస్తుండడం, అందులోనూ నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుండడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రింది లింకు ద్వారా భారత రైస్ కొనుగోలు చేయవచ్చు...

Click Here to buy Bharat Rice


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top