APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5- 9వ తరగతి ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో రెగ్యులర్ బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హులైన బాలబాలికలు ఏప్రిల్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు స్టేట్ సిలబస్, ఆంగ్ల మాధ్యమ ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ప్రవేశ వివరాలు:
* అయిదో తరగతి అడ్మిషన్లు, 6, 7, 8, 9 తరగతుల్లో రెగ్యులర్ బ్యాక్లాగ్ సీట్లలో ప్రవేశాలు
సీట్లు: అయిదో తరగతిలో 2480; ఆరో తరగతిలో 481; ఏడో తరగతిలో 174; ఎనిమిదో తరగతిలో 11 తొమ్మిదో తరగతిలో 188 సీట్లు ఉన్నాయి.
రిజర్వేషన్: అయిదో తరగతి ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తు అర్హులు. 6, 7, 8, 9 తరగతి రెగ్యులర్ బ్యాక్గ్ సీట్లలో ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థులు మాత్ర దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.
అర్హత: తరగతిని అనుసరించి నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుతా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం చదివి ఉండాలి. విద్యార్థి తల్లిదండ్ర వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-04-2024.
హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం: 11-04-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 21-04-2024.
మెరిట్ జాబితా వెల్లడి: 10-05-2024.
0 comments:
Post a Comment