Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో (APSWREIS) 2024-25 విద్యా సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో (APSWREIS) 2024-25 విద్యా సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాధ్యమము) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు కోరుచున్నారు దరఖాస్తులు 25.01.2004 నుండి 23.02.2024 వరకు ఆన్ లైన్లో సమర్పించుటకు గాను నోటిఫికేషన్ జారీచేయటం జరిగింది. ఇందుకు సంబంధించిన సమాచారం కొరకు Dr.B.R. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) ( (Principals) గాని సంప్రదించగలరు.

అభ్యర్థులకు సూచనలు:

1. ప్రవేశమునకు అర్హత:

వయస్సు: ఎస్ సి (S.C) మరియు ఎస్ టి (S.T) విద్యార్థులు తేదీ 01.09.2011 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి. 22 (0.0), 2 (B.C), ১ కన్వెర్టర్ క్రిష్టియన్స్ (BC-C) విద్యార్థులు తేదీ 01.09.2013 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.

సంబంధిత జిల్లాలలో 2022-23 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2023- 24 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.

ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/ సంరక్షకులు సంవత్సరాదాయము రూ.1,00,000/- మించి ఉండరాదు.

II. రిజర్వేషన్ వివరాలు:

 2 S.C-75%, BC-C (Converted Christians)-12%, S.T-6%, B.C-5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.

ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, అనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. అట్టి వారు సంబంధిత సర్టిఫికెట్ ను జతపరవలెను. వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.

ఏదైనా కేటగిరీలో సీట్లు భర్తీకాని యెడల, వాటిని SC కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు.

ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మచారి విద్యార్థులకు కేటాయించబడును. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక - A (Annexure - A) నందు ఇవ్వబడినవి.

గమనిక:

పైన పొందు పరిచిన సమాచారంలో, ఇతర వివరముల కొరకు మీకు దగ్గరలో ఉన్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) Dr.B.R. అంబేద్కర్ పాఠశాలల (Principals) వారిని గాని సంప్రదించగలరు..

ఏ సమయంలోనైనా admission ప్రక్రియ లో భాగంగా అవసరమైన మార్పులు చేయుటకు / రద్దు చేయుటకు సంపూర్ణ అధికారము Secretary. APSWREIS కు కలదు.

హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత విద్యార్థి తల్లితండ్రులు పరీక్ష కేంద్రమును స్వయంగా పర్యవేక్షించుకొని, తగిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకొనవలెను. పరీక్ష మొదలైన పది నిమిషాల తరువాత ఎట్టి పరిస్థితులలోను అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు.

పరీక్ష కేంద్రానికి అభ్యర్థి పరీక్ష ప్యాడ్, నీలి/ నలుపు రంగు బాల్ పాయింట్ పెన్ తప్పక తీసుకొనివెళ్ళవలెను.

III. దరఖాస్తు చేయు విధానం:

1 2 https://apbragcet.apcfss.in ద్వారా దరఖాస్తులు సమర్పించవలయును.

తేదీ 25.01.2024 నుండి 23.02.2024 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది. తేదీ 23.02.2024 తరువాత దరఖాస్తులు స్వీకరించడము జరగదు.

విద్యార్థులు దగ్గరలోని, ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులు సమర్పించవలయును.

#దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.

IV) ఎంపిక విధానము:

2024-25 విద్యాసంవత్సరమునకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 10.03.2024 న 10.00 AM నుండి 12.00 noon వరకు నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు 'కేటాయించడము జరుగుతుంది.

V) ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తున్న అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల వివరములు (Annexure- A) మరియు జిల్లా సమన్వయ అధికారుల ఫోన్ నంబరు (Annexure-B) మరియు ఇతర వివరములు (Annexure-C) నందు తెలుపబడినవి.

Download Complete Notification

Online Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top