పోచంపల్లి మండలంలోని జలాల్‌పుర్ గ్రామంలో ఉన్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో వివిధ కోర్సులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమం ద్వారా తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లోని అర్హత ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకుల నుంచి ఉపాధి శిక్షణకై హాస్టల్ భోజన వసతితో స్వల్ప కాల కోర్సులకు నేరుగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యస్.సి, యస్.టి, మైనారిటీ విద్యార్థిని, విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. బేసిక్ కంప్యూటర్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) అకౌంట్ అసిస్టెంట్ (ట్యాలీ) కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ 2 వీలర్ సర్వీసింగ్ , సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్) సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ సర్వీస్ కోర్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇందుకు అర్హత గల అభ్యర్థులు సంస్థలో ఈనెల 17వ తేదీన 10 గం.లకు నేరుగా దరఖాస్తు చేసుకొని ప్రవేశం పొందాలని సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నాలుగు నెలల కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కోర్సుల వారీగా డిగ్రీ, బీకామ్, ఇంటర్మీడియట్ పదవ తరగతి పాస్ అయి, 18-35 సంవత్సరాల వయసున్న గ్రామీణ అభ్యర్థులు అయి ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. ఒరిజినల్ సర్టిఫికెట్, జిరాక్స్ సెట్ పాస్పోర్ట్ ఫోటోలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎంపిక కాబడిన అభ్యర్థులు రూ.250/-ల రిఫండబుల్ డిపాజిట్ చెల్లించవలెను. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్సైట్ గానీ, 9133908000, 9133908111, 9133908222, 9948466111 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చు.
0 comments:
Post a Comment