ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను ప్రకటించనున్నారు. రేపు మొత్తం ఎన్ని ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారో..ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే..
అన్ని జిల్లాల్లోను వివిధ మేనేజ్‌మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని మూడునెలల క్రితమే డీఈఓలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేసి, వివరాలు సేకరించింది. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి, ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల ఎదురుచూపులకు రేపు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనతో ఎంతో ఊరట రానున్నది.
0 comments:
Post a Comment