Praja Palana Appplication Praja Palana Abhyahastam Application TS Praja Palana Application Ts Abhaya Hastam Application 6 Guarantees Application six Guarantees Revanth Reddy Six Guarantees Congress TS 6 Guarantees Praja Palana Application pdf
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు లబ్దిదారులను ఎంపిక చేసేందుకు.. సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. పది రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. అయితే.. ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి.. ఎలా నింపటం.. దానికి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం లాంటి సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే.. వాటన్నింటికి చెక్ పెడుతు ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తు ఫారం విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం నుంచి సిద్ధం చేసింది సర్కారు. అయితే.. ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. అన్నింటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది. మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ కుటుంబ వివరాలలో.. కుటుంబ యజమాని పేరుతో మొదలై.. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది.
ఆ తర్వాత.. వరుసగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఆ పథకం కింద అడిగిన వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది.
మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందెందుకు అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్కు పెట్టాల్సి ఉంటుంది. రూ.500 సబ్సీడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్లు గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజన్సీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది.
రైతు భరోసా కోసం.. లబ్ది పొందే వ్యక్తి రైతా, కౌలు రైతా టిక్ చేసి.. పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, సాగు చేస్తున్న భూమి ఏకరాలను పేర్కొనాలి. ఒకవేళ రైతు కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి.
ఇక ఇందిరమ్మ ఇండ్లు పొందాలనుకునే వాళ్లు.. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి. లేదా అమరవీరుల కుటుంబానికి చెందినవాళ్లయితే.. పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబర్, డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. ఒకవేళ ఉద్యమకారులైతే.. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్, లేదా జైలుకు వెళ్లిన వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇక గృహ జ్యోతి పథకం కోసం.. నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తారన్నది యూనిట్లలో పేర్కొనాల్సి ఉంటుంది. దానితో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి.
ఇక చేయూత పథకం పొందాలనుకునేవారు.. దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి లేదా.. వాళ్లు వృద్ధులా, వితంతువుల, బీడీ కార్మికులా, చేనేత కార్మికులా అన్నది వాళ్లకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాల్సి ఉంటుంది. అన్ని అయ్యాక కింద.. దరఖాస్తు దారుని పేరు, సంతకం, తేదీ వేయాలి.
ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్‌ను కూడా జతపర్చాల్సి ఉంటుంది. ఇలా నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించి.. వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.
ప్రజాపాలన ధరఖాస్తు ఫారం కోసం క్లిక్ చేయండి..
Praja palana Application Download Here
0 comments:
Post a Comment