Find My Device: మీ ఫోన్‌ పోయిందా? గూగుల్‌ హెల్ప్‌తో తిరిగి పొందడం మరింత ఈజీ

స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. గతంలో దొంగలు మన జేబుల్లోని పరసులను కొట్టేసేవారు. అయితే డిజిటల్‌ పేమెంట్లు ఎక్కువ కావడంతో ఇప్పుడు దొంగలు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్న స్మార్ట్‌ ఫోన్లను కొట్టేస్తున్నారు.


Find My Device: మీ ఫోన్‌ పోయిందా? గూగుల్‌ హెల్ప్‌తో తిరిగి పొందడం మరింత ఈజీ

అయితే ఫోన్‌ పోయిందని వదిలెద్దామంటే అందులోని విలువైన డేటా తస్కరిస్తారేమో? అని భయం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ సమయంలో ఫోన్‌ను తిరిగి పొందడానికి పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అందరూ వాడే ఫోన్లు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందించే గూగుల్‌ మన ఫోన్లు ఎక్కడ ఉన్నాయో? తెలుసుకునేందకు ఫైండ్‌ మై డివైజ్‌ అనే ఆప్షన్‌ ద్వారా సాయం చేస్తుంది. కాబట్టి గూగుల్‌ ఫైండ్‌ మై డివైజ్‌ను వాడుకుని తస్కరించిన ఫోన్‌ను ఎలా కనుగొనాలో? ఓసారి తెలుసుకుందాం.

ఫైండ్‌ మై డివైజ్‌ సెటప్‌

వినియోగదారుడు ఫోన్‌లో గూగుల్‌ ఖాతాను ఉపయోగించి లాగిన్‌ అయితే స్వయం చాలకంగానే ఫైండ్‌ మై డివైజ్‌లో నమోదవుతుంది. అయితే భద్రతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ సదుపాయాన్ని ఆపేయచ్చు. ఇలా చేస్తే ఫోన్‌ పోగొట్టుకున్న సమయంలో కనుగొనడం కుదరదు. మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను లాగిన్‌ అయ్యాక యాక్టివ్‌ ఇంటర్నెట్‌ ఉంటేనే ఫోన్‌ కనుగొనడం సులభం అవుతుంది. ముఖ్యంగా మీ ఫోన్‌ ఎక్కడైనా పెట్టి మర్చిపోయిన సందర్భంలో తిరిగి కనుగొనడంలో ఫైండ్‌ మై డివైజ్‌ యాప్‌ సరిగ్గా సరిపోతుంది. అలాగే ఈ ఫైండ్‌ మై డివైజ్‌ ద్వారా మన ఫోన్‌ లాక్‌ చేసి డేటా తస్కరించడకుండా చేయవచ్చు. ఫైండ్‌ మై డివైజ్‌ ద్వారా చేసే మూడు ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.

సౌండ్‌ ప్లే చేయడం

మన ఫోన్‌ కనుగొనడానికి పొగొట్టుకున్న ఫోన్‌లోని గూగుల్‌ ఖాతాను వేరే ఇతర ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన ఫైండ్‌మై డివైజ్‌లో లాగిన్‌ అయ్యి తెలుసుకోవచ్చు. ఫోన్‌ దగ్గర్లో ఉన్నట్టు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా చూపితే ప్లే సౌండ్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే మన ఫోన్‌ ఎక్కడ ఉన్నా సౌండ్‌ ప్లే అవుతుంది. ఫోన్‌ సైలెంట్‌లో ఉన్నా సౌండ్‌ ప్లే అవుతుంది.

డేటా కూడా సేఫ్‌

ముఖ్యంగా ఫోన్‌ పోయినప్పుడు అందులోని డేటా గురించిన భయం అందరినీ వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఫైండ్‌ మై డివైజ్‌ ద్వారా ఫోన్‌ను లాక్‌ చేసుకోవచ్చు. అలాగే లాక్‌ స్క్రీన్‌ మన సందేశాన్ని కనిపించేలా చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా మన ఫోన్‌ ఎవరికైనా దొరికితే తిరిగిచ్చే అవకాశం ఉంటుంది. 

డేటా రీసెట్‌

మన ఫోన్‌ను ఎక్కడ కనుగొనలేకపోతే మాత్రం ఫైండ్‌ మై డివైజ్‌ ద్వారా ఫోన్‌ రీసెట్‌ చేయవచ్చు. ఇలా చేస్తే మన డేటా దుర్వినియోగం కాకుండా ఉంటుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top