STATE EDUCATIONAL ASSESSMENT SURVEY - SEAS-2023 (NAS) 03-11-2023.
మండల విద్యాధికారులకు సూచనలు.
1) ముఖ్యమైన సూచనలు:
> పరీక్షను ఎంపిక చేసిన పాఠశాలలోనే నిర్వహించాలి, ఏదైనా పాఠశాల మార్పు జరిగి అధికారికంగా పేరు ప్రకటించి ప్రశ్నపత్రాలు సరఫరా జరిగినప్పుడు మాత్రమే మరొక పాఠశాలలో పరీక్ష నిర్వహించాలి.
> ఎంపిక చేసిన పాఠశాలలో ఎన్ని తరగతులున్నా నిర్దేశించిన తరగతికి (3 or 60 or gh) మాత్రమే పరీక్ష నిర్వహించాలి. ఒక వేళ ఒకటి కన్నా ఎక్కువ తరగతులు ఎంపిక చేసి ఉంటే అప్పుడు ఎంపిక చేసిన (306 లేదా 689 లేదా తరగతులకు పరీక్ష నిర్వహించాలి.
-> ఏదైనా ఎంపిక చేసిన పాఠశాల పూర్తిగా మూతబడి ఉంటే ఆ పాఠశాలలో పరీక్ష నిర్వహించరాదు. జ: పాఠశాల మెటీరీయల్ ఓపెన్ చేయకుండా మండల విద్యాధికారి కార్యాలయం లోనే ఉంచుకొని, అన్ని పాఠశాలల్లో పరీక్ష ముగిసిన తర్వాత వాటితో కలిపి DCEB కి పంపాలి..
> 5 మంది కంటే తక్కువ మంది పిల్లలు నమోదై ఉన్నా కూడా ఆ పాఠశాలలో పరీక్ష నిర్వహించాలి.
> పరీక్ష జరిగే రోజున ఎంపిక చేసిన తరగతిలోని మొత్తం పిల్లలు అబ్నెంట్ అయితే కేవలం టీచర్స్ క్వశ్చనీర్ (TQ) మరియు స్కూల్ క్వశ్చనీర్ (50) లను. మాత్రమే భర్తీ చేసి ప్యాక్ చేసి మండల విద్యాధికారి కార్యాలయానికి పంపాలి.
> 3 వ తరగతి పిల్లలకు పరీక్ష నిర్వహించేటప్పుడు వారికి ప్రశ్నాపత్రాన్ని మాత్రమే ఇవ్వాలి. OMR షీట్ ను ఇవ్వరాదు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ 3 వ తరగతి పిల్లల OMR షీట్ లో బబుల్ చేస్తారు. 6 మరియు 9 తరగతుల పిల్లలకు ప్రశ్నాపత్రంతో పాటు OMR షీట్ ను కూడా ఇవ్వాలి.
> సర్వే జరిగే రోజు కొన్ని పాఠశాలలను సందర్శించి సర్వే జరిగే తీరును పరిశీలించాలి.
2) సర్వే మెటీరియల్ గురించి సూచనలు:
> ఎంపిక చేసిన అన్ని పాఠశాలలకు మెటీరియల్ వచ్చాయో లేదో నిర్ధారించుకోవాలి.
>స్కూల్ వారీగా, స్కూల్ కాంప్లెక్స్ వారీగా మెటీరీయల్ ను విభజించుకోవాలి.
> ఒక స్కూల్ కాం ప్లెక్స్ పరిధిలోని మొత్తం స్కూళ్ళ మెటీరియల్ ను ఆ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లేదా సి. ఆర్. పి. ద్వారా 2వ తేదీ గురువారం స్కూల్ కాంప్లెక్స్ కు.చేర్చాలి. స్కూల్ కాంప్లెక్స్ లో సంబంధిత ప్రధానోపాధ్యాయుడితో పాటు మరొక్ష ప్రధానోపాధ్యాయుడు జాయింట్ కస్టోడియన్ గా మెటీరియల్ ను భద్రపరచాలి..
> 3వ తేదీ ఉదయం పాఠశాల ప్రారంభ సమయం లోపు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా సి. ఆర్. వి. ద్వారా స్కూల్ కాంప్లెక్స్ నుండి సర్వే మెటీరీయల్ పాఠశాల కు చేరేలాగా ఆదేశించాలి. స్కూల్ కాంప్లెక్స్ నుండి ఏ పాఠశాలకు ఎవరు తీసుకెళ్లాలో వారికి 2వ తేదీ నాడే తెలియజేయాలి..
> 3వ తేదీ ఉదయం పాఠశాల ప్రారంభ సమయం లోపు సర్వే మెటీరియల్ అన్ని పాఠశాలలకు చేరిందో లేదో నిర్ధారించుకోవాలి.
> సర్వే మెటీరీయల్ కు సంబందించి ప్రతి స్థాయి లోనూ గోప్యత పాటించాలి.
> ఎంపిక చేసిన ఏదైనా పాఠశాలకు సర్వే మెటీరీయల్ రాకుంటే లేదా మీ మండలానికి సంబందించని సర్వే మెటీరియల్ (కవర్) మీ మండలానికి వచ్చి ఉంటే వెంటనే సెక్రెటరీ, DCEB లేదా AMO కు తెలియజేయాలి.
పరీక్ష పూర్తయిన తర్వాత సూచనల మేరకు ప్యాక్ చేసిన మెటీరియల్ ను 3 వ తేదీ సాయంత్రం స్కూల్ నుండి నేరుగా మండల విద్యాధికారి కార్యాలయానికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా సి. ఆర్. పి. ని అందజేయమని చెప్పాలి.
2) ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ల గురించి సూచనలు :
-> ఎంపికైన పాఠశాల కు కేటాయించిన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ వివరాలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి తెలియజేయాలి. అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ కు కేటాయించిన పాఠశాల మరియు ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుని వివరాలను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ కు తెలియజేయాలి.
> ఏదేని కారణం చేత కేటాయించిన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పరీక్ష సమయానికి హాజరు కాకుంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థి/వ్యక్తి (ఆల్టర్నేటివ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) చేత పరీక్షను నిర్వహించేలాగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించాలి.
>-2వ తేదీ నాడే ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఆల్టర్నేటివ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ను ఐడెంటిఫై చేసుకొమ్మని చెప్పాలి.
ప్ర సర్వే జరిగే గదిలో సరైన వెంటిలేషన్, వెలుతురు, తాగునీరు మొదలైనవి. ఉండేలా ఏర్పాటు చేయాలి.
> ఏదేని కారణం చేత కేటాయించిన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పరీక్ష సమయానికి హాజరు కాకుంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్ధి/వ్యక్తి (ఆల్టర్నేటివ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) చేత పరీక్షను నిర్వహించాలి.
> 2వ తేదీ నాడే ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఆల్టర్నేటివ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ను ఐడెంటిఫై చేసుకోవాలి.
> ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ సర్వే నిర్వహించడానికి అవసరమైన సమాచారాన్ని అందించాలి.
> ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ సర్వే మెటీరియల్ ను ప్యాక్ చేయడానికి సహకరించాలి.
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ లకు సూచనలు.
> 3 వ తేదీ ఉదయం ప్రార్ధనా సమయం కంటే ముందే కేటాయించిన పాఠశాల కు చేరుకొని అన్నీ ఏర్పాట్లు చూసుకొని 10.30 గంటలకు సర్వే ప్రారంభించాలి.
> 3 వ తరగతి పిల్లలకు సర్వే నిర్వహించేటప్పుడు వారికి ప్రశ్నాపత్రాన్ని మాత్రమే ఇవ్వాలి. OMR షీట్ ను ఇవ్వరాదు. 3 వ తరగతి పిల్లలకు ప్రతి ప్రశ్నను మరియు 4 ఆప్షన్స్ (ఆన్సర్స్) ను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ గట్టిగా చదివి వినిపించాలి. సరియైన సమాధానమేదో విద్యార్థి నిర్ధారించుకున్న తర్వాత సరైన ఆప్షన్ (A or B or C or D) కు సర్కిల్ చేస్తారు. అలా మొత్తం ప్రశ్నలు పూర్తి అయ్యే వరకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ చదువుతూ వివరిస్తూ ఉంటే పిల్లలు అర్థం చేసుకొని వారు సరైన సమాధానం అనుకున్న ఆప్షన్ చుట్టూ సర్కిల్ చేస్తారు. ప్రశ్నలు సమాధానాలు వివరించి చెప్పాలి గానీ సరైన సమాధానమేదో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ చెప్పకూడదు.
> 3 వ తరగతి పిల్లలకు పరీక్ష పూర్తి అయిన తర్వాత OMR షీట్ లో వివరాలన్నీ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ భర్తీ చేయాలి. ప్రశ్న పత్రంలో పిల్లలు సర్కిల్ చేసిన ఆప్షన్ ను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ OMR షీట్ లో బబుల్ చేస్తారు. బబ్లింగ్ ను కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే చేయాలి.
> 6 మరియు 9 తరగతుల పిల్లలకు ప్రశ్నాపత్రం తో పాటు OMR షీట్ ను కూడా ఇవ్వాలి. పరీక్ష ఏ విధంగా రాయాలో, OMR షీట్ లో ఏ విధంగా బబ్లింగ్ చేయాలో వారికి అర్థమయ్యేలాగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ వివరించాలి. ఎక్కడైనా పిల్లలకు అర్థం కాకుంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ప్రశ్నలు సమాధానాలు వివరించి చెప్పవచ్చు కానీ సరైన సమాధానమేదో చెప్పకూడదు.
> అందరు పిల్లలకు కామన్ గా ఉండే అంశాలను బోర్డు పై వ్రాయాలి. ఉదా.. డైస్ కోడ్, స్కూల్ పేరు, గ్రామం మండలం పేరు జిల్లా రాష్ట్రం పేరు మొదలైనవి.
ప్యాకింగ్ కు సూచనలు.
> ప్రస్తుతం ఖాళీ OMR షీట్ ఉన్నసీల్డ్ కవర్ లో రెండు పాలిథిన్ ఖాళీ కవర్లు (New) ఉన్నాయి. వాటిలో
కవర్ - 1 లో ఫీల్డ్ OMR షీట్స్ (విద్యార్థులవి),
కవర్ - 2 లో (T.Q) & (S.Q) ల ఫీల్డ్ OMR షీట్స్ ఉంచాలి. కవర్ - 3 (ప్రస్తుతము సీల్డ్ OMR ఉన్న కవర్) లో used Survey Questineers, PQ Q లను ఉంచాలి.
కవర్ - 4 (ప్రస్తుతము PQ. TO SQ ఉన్న కవరు) లో వాడని మెటీరియల్ మొత్తము ఉంచి ప్యాక్ చేసి నేరుగా మండల విద్యాధికారి కార్యాలయానికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా సి. ఆర్. పి కి అందజేయాలి.
0 comments:
Post a Comment