కర్ణాటక రాష్ట్రం, కిట్టూర్ రాణి చెన్నమ్మ బాలికల రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైనట్లు విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష 2024, జనవరి 28న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారని, ఈ పరీక్షకు 2012, జూన్ 1నుంచి 2014, మే 31వ తేదీలోపు జన్మించిన విద్యార్థినులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని తిరుపతిలోని విశ్వం ఉచిత పోటీ పరీక్షల సమాచార కేంద్రంలో నేరుగానూ, 93999 76999, 86888 88802 ను సంప్రదించాలని ఆయన కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment