బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ విభాగంలో డిగ్రీతోపాటు తగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 18 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.885 చెల్లిస్తే సరిపోతుంది.
వివరాలు..
* నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 161
అర్హత: బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత ఉండాలి. రాష్ట్రపరిధిలో నర్సెస్ & మిడ్‌వైఫ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
అనుభవం: కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18.11.2023 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.1,180. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.885 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పే స్కేల్: నెలకు రూ.9300-రూ.34800.
Download Complete Notification
0 comments:
Post a Comment