దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్బీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల చేసినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్ష నవంబర్ 4న
ప్రధాన కేంద్రాల్లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. 25% మిగిలిన సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు
Jawaha Navodaya 6th Class Entrance Test Hall Tickets
0 comments:
Post a Comment