EMRS ఏకలవ్య మోడల్ పాఠశాలలో బోధన బోధ నేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తు చేసుకునే గడువు పెంపు

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల(EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పెరిగింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెక్స్ట్) నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తులు పొడిగించినట్లు నెక్స్ట్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్/ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు- జులై 31; 6,329 టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులకు- ఆగస్టు 18న దరఖాస్తు ప్రక్రియ ముగియగా తాజాగా గడువు పొడిగించారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నెక్స్ట్(NESTS) తెలిపింది. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మొత్తం పోస్టులు:

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 5,660

హాస్టల్ వార్డెన్ (పురుషులు) : 335

హాస్టల్ వార్డెన్ (మహిళలు) :334

ప్రిన్సిపల్: 303

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 2,266

అకౌంటెంట్:361

జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ 759

ల్యాబ్ అసిస్టెంట్:373

మొత్తం ఖాళీలు: 10,391


Apply Here 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top