ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ముంబాయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు..ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ముంబాయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రేపట్నుంచి (సెప్టెంబర్ 7) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులను దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఉన్న ఎస్బీఐ బ్రాంచుల్లో పోస్టింగ్ ఇస్తారుకేటగిరీల వారీగా పోస్టుల వివరాలు..
ఎస్సీ కేటగిరీలో పోస్టులు: 300
ఎస్టీ కేటగిరీలో పోస్టులు: 150
ఓబీసీ కేటగిరీలో పోస్టులు: 540
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టులు:200
యూఆర్ కేటగిరీలో పోస్టులు: 810
వయోపరిమితి: ఏప్రిల్ 1, 2023వ తేదీ నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాలకు వయసు విషయంలో మినహాయింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 27, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచుల్లో విధులు నిర్వహించవల్సి ఉంటుంది. నెలకు జీతంగా రూ.41,960లతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు
ఎంపిక విధానం..
మొత్తం మూడు ఫేజుల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటి ఫేజ్‌లో ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుంది. రెండో ఫేజ్‌లో మెయిన్ పరీక్ష ఉంటుంది. మూడో ఫేజ్‌లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటుంది. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: సెప్టెంబర్ 7, 2023 నుంచి సెప్టెంబర్ 27,2023 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబర్ 27,2023
ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2023, అక్టోబర్ రెండో వారంలో నుంచి
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: నవంబర్ 2023
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల తేదీ: నవంబర్, డిసెంబర్ 2023
మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్ లేదా డిసెంబర్ 2023లో
మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2023 లేదా జనవరి 2024లో
మెయిన్ పరీక్ష ఫలితాల తేదీ: డిసెంబర్ 2023 లేదా జనవరి 2024లో
ఇంటర్వ్యూ తేదీ: జనవరి లేదా ఫిబ్రవరి 2024
తుది ఫలితాల ప్రకటన తేదీ: ఫిబ్రవరి లేదా మార్చి 2024
Job Notification Telegram Group:
Job Notification Whatsapp Group:
https://chat.whatsapp.com/GYKpvGHibbZ7sooE0URgGz
0 comments:
Post a Comment