భారతదేశంలో అతిపెద్ద స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఒకటైన రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24 విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతదేశం అంతటా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 5,000 పైగా అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు (UG Scholarship) అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 15 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. డిగ్రీ, పీజీ చేదువుకోవడానికి ఆసక్తి ఉండి ఫీజు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఈ స్కాలర్ షిప్ ప్రయోజనకరంగా ఉంటుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా 5000 UG స్కాలర్‌షిప్‌లు మరియు 100 PG స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ UG స్కాలర్‌షిప్ కోసం గరిష్టంగా రూ. 2 లక్షలు మరియు PG కి గరిష్టంగా రూ. 6 లక్షల స్కాలర్‌షిప్‌గా నిర్ణయించింది.
ఎలా అప్లై చేయాలంటే:
విద్యార్థులు ఫౌండేషన్ యొక్క స్కాలర్‌షిప్ పోర్టల్ reliancefoundation.org ను సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చు.
UG-PG స్కాలర్‌షిప్ కోసం అర్హత:
స్కాలర్‌షిప్ పోర్టల్ ప్రకారం దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ఈ సంవత్సరం ఏదైనా కోర్సులో చేరిన మొదటి సంవత్సరం/సెమిస్టర్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా పీజీ కోర్సులకు పీజీ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రెండు స్కాలర్‌షిప్‌ల గురించి మరింత సమాచారాన్ని చూడవచ్చు.
ఎలా అప్లై చేయాలంటే:
- విద్యార్థులు మొదటగా https://www.scholarships.reliancefoundation.org/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- అనంతరం హెం పేజీలో కనిపించే Application Portal ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీ వివరాలను నమోదు చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి.
0 comments:
Post a Comment