ఫిబ్రవరి 2023 లో జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు 01-10-2023 నుండి తమ వివరములు నమోదు చేసుకొనుటకు అందుబాటులో ఉండును అని తెలియజేసినారు. విద్యార్థి వివరములు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లో ఉండేవిధంగా సరిచూసుకుని పోర్టల్ నందు తమ వివరములు ది. 30-11-2023 లోపు నమోదు చేసుకొనవలెను. విద్యార్థి వివరములను సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో ది. 15-12-2023 లోపు క్షుణ్ణం గా పరిశీలించి, స్కూల్ నోడల్ ఆఫీసర్ లాగిన్ (INC) ద్వారా ధృవీకరించవలెను. పోర్టల్ అప్లికేషన్ మరియు వివరములను ధృవీకరించే పత్రములను విద్యార్థులు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించి ది. 30-12-2023 లోపు జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ (DNO) ద్వారా అప్లికేషన్ ను ధృవీకరించుకొనవలెను. ఈ తేదీలు ఎటువంటి పొడిగింపు ఉండదు అని తెలిపిన తేదీల లోపు సంబంధిత INO మరియు DNO లు తప్పకుండా వారి వారి లాగిన్ ల ద్వారా అప్లికేషన్లను వెరిఫై చేయవలెను, లేనియెడల ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్ మంజూరు కాబడదు అని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడమైనది. మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ కార్డ్ పైన లేని విద్యార్థులు వెంటనే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లలో సరిచేయించుకొనవలెను. లేని యెడల వెంటనే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సంప్రదించవలెను. అదేవిధంగా నవంబరు 2019, ఫిబ్రవరి 2021 మరియు మార్చి 2022 సంవత్సరములలో ఎంపిక కాబడి ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో/కళాశాలల్లో చదువుచున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. లేనియెడల స్కాలర్షిప్ మంజూరు కాబడదు. ఈ పథకం యొక్క విధి విధానాలు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు పొందగలరు. విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాబడదు, దానికి విద్యార్ధి తల్లితండ్రులు మరియు సంబంధిత పాఠశాలవారే బాధ్యత వహించవలసి ఉంటుంది అని ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు శ్రీ డి . దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment