నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీపీఆర్) కాంట్రాక్టు ప్రాతిపదికన సీబీసీ అండ్ ఎస్క్యూ మానిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా మొత్తం 172 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 172
* సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ అండ్ స్టేట్ క్వాలిటీ మానిటర్: 24
* కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ అండ్ స్టేట్ క్వాలిటీ మానిటర్: 148
అర్హత:ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:17.08.2023 నాటికి 62 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు:జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ:ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం:నెలకు సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ అండ్ స్టేట్ క్వాలిటీ మానిటర్కు రూ.75,000; కెపాసిటీ బిల్డింగ్కన్సల్టెంట్ అండ్ స్టేట్ క్వాలిటీ మానిటర్కు రూ.60,000.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ:17.08.2023.
0 comments:
Post a Comment