EMRS Jobs: ఏకలవ్య స్కూళ్లలో 4,062 పోస్టులు.. దరఖాస్తుల గడువు పొడిగింపు

 దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో(EMRS) 4,062 టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల గడువు జులై 31తో ముగిసింది

దీంతో ఆ గడువును ఆగస్టు 18వరకు పొడిగిస్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(NESTS) నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులకు భర్తీకి అర్హులైన వారు ఆగస్టు 18 వరకు https://emrs.tribal.gov.in/వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

మొత్తం ఖాళీలు 4,062 కాగా.. వీటిలో ప్రిన్సిపల్‌-303; పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)-2266; అకౌంటెంట్‌-361; జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జేఎస్‌ఏ)- 759; ల్యాబ్‌ అటెండెంట్‌-373 చొప్పున ఉన్నాయి.

అర్హతలు: ప్రిన్సిపల్‌ పోస్టులకు బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. కనీసం 12 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించరాదు. నెలకు రూ.78800-రూ.209200 చెల్లిస్తారు.

పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారు బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 40 ఏళ్లు మించరాదు. నెలకు రూ.47600-రూ.151100 చెల్లిస్తారు.

అకౌంటెంట్‌ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉంటే చాలు. వయసు 30 ఏళ్లు మించొద్దు. నెలకు రూ.35400-రూ.112400 చెల్లిస్తారు. జేఎస్‌ఏ ఉద్యోగాలకు సీనియర్‌ సెకండరీ ఉత్తీర్ణులైతే చాలు. వయసు 30 ఏళ్లు మించరాదు. రూ.19900-రూ.63200 చెల్లిస్తారు. ల్యాబ్‌ అటెండెంట్‌ ఉద్యోగాలకు 10/12వ తరగతి పాసైతే చాలు. వేతనం రూ.18000-రూ.56,900గా పేర్కొన్నారు.

ఎంపిక విధానం: ఓఎంఆర్‌ బేస్డ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు రుసుం: ప్రిన్సిపల్‌: రూ.2000; పీజీటీ: రూ.1500; నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌: రూ.1000 చొప్పున నిర్ణయించారు.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్


▪️ మొత్తం పోస్టులు:4062
1. ప్రిన్సిపల్ - 301
2. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) - 2266
3. అకౌంటెంట్-361
4. జూనియర్ సెరటేరియట్ అసిస్టెంట్: 759
5. ల్యాబ్ అటెండెంట్: 373

▪️దరఖాస్తుకు చివరి తేది: 18.08.2023

*పూర్తి నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలవు...*

Complete Notification & Online Application

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో TGTs మరియు హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల


▪️ ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు:5660
▪️ హాస్టల్ వార్డెన్లు( Male): 335
▪️ హాస్టల్ వార్డెన్లు ( Female) : 334
▪️ మొత్తం పోస్టులు: 6329

దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:18.08.23

Complete Notification & Application


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top