Child Care Leave: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. శిశు సంరక్షణ సెలవులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై శిశు సంరక్షణ సెలవులను 730 కి పెంచింది.
భార్యా భర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి పిల్లలను పెంచడం కోసం ఎవరో ఒకరు సెలవు పెట్టుకోవల్సి వస్తుంటుంది. వారికి ప్రభుత్వం మంజూరు చేసే చైల్డ్ కేర్ లీవ్స్ సంఖ్య వరకు ఉపయోగించుకున్న తరువాత అదనంగా కావల్సి వస్తుంది. అటువంటి సమయంలో ఇద్దరిలో కొద్ది రోజులు ఒకరు సెలవులు పెట్టుకొని పిల్లలను చూసుకుంటే.. మరికొద్ది రోజులు మరొకరు సెలవు పెట్టుకొని పిల్లల సంరక్షణలో కొనసాగాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు కొనసాగుతోంది. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి ఉద్యోగులను బయటపడేయడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే శిశు సంరక్షణ సెలవులను పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్దోగులైతే.. పిల్లల పెంపకంపై ప్రభావం పడుతోందని.. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలు, ప్రభుత్వ ఉద్యోగం చేసే ఒంటరి పురుషుల (సింగిల్ మెన్)కు 730 రోజుల శిశు సంరక్షణ సెలవులకు అర్హులని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. బుధవారం ఆయన పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. కేంద్ర వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్ , ఇతర పోస్టులకు నియమితులైన మహిళా ప్రభుత్వ ఉద్యోగులు , ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు), 1972లోని 43-C ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ (CCL)కి అర్హులని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ విభాగాలకు చెందిన ఉద్యోగుల మొదటి ఇద్దరు పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకూ సంరక్షణ కోసం మొత్తం సర్వీసులో గరిష్టంగా 730 రోజుల వ్యవధి.. వికలాంగ పిల్లల విషయంలో వయోపరిమితి లేదని కేంద్ర మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పురుషులు పుట్టిన లేదా దత్తత తీసుకున్న ఆరు నెలలలోపు 15 రోజుల సెలవులకు అర్హులు కాగా..2022లో తల్లులపై భారాన్ని తగ్గించేందుకు పితృత్వ సెలవులను పెంచాలని మహిళా ప్యానెల్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే శిశు సంరక్షణ సెలవులపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో తల్లిదండ్రుల సెలవు ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ద్వారా అమలు జరుగుతోంది. ఈ చట్టం మేరకు పని చేసే మహిళలు ఆరు నెలల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను తీసుకోవడానికి అనుమతి లభిస్తుంది.
0 comments:
Post a Comment