బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలాడాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని ఎంతో మంది విద్యార్థులు కలలు కంటారు. కానీ ఆర్థిక స్థోమత కారణంగా కలలు కలలుగానే మిగిలిపోయే పరిస్థితి. అయితే ఇలాంటి వారికి దొరికిన వరమే విద్యాలక్ష్మి పథకం. విద్యార్థులకు అతి తక్కువ వడ్డీకి సులువుగా.. ఎలాంటి హామీ లేకుండా ఈ రుణాన్ని పొందవచ్చు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విద్యాలక్ష్మి పోర్టల్ ను ప్రారంభించింది. ఎలాంటి హామీ అవసరం లేకుండా.. తక్కువ వడ్డీకి విద్యార్థులకు సులభంగా ఎడ్యుకేషన్ లోన్ అందించాలన్న ఆలోచనతో ఈ పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ లోన్ ని పొందాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే మూడు బ్యాంకుల్లో మూడు రకాల ఎడ్యుకేషన్ లోన్లకి దరఖాస్తు చేసుకున్నట్టు లెక్క. ఇందులో మూడు రకాల రుణాలు ఉంటాయి. రూ. 4 లక్షల లోపు ఋణం ఒకటి, రూ. 4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల లోపు వరకూ మరొకటి, రూ. 7.5 లక్షల పైన మరొక ఋణం. బయట బ్యాంకుల్లో తీసుకునే రుణాలతో పోలిస్తే ఈ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా తీసుకునే విద్యా రుణానికి వడ్డీ చాలా తక్కువ. ఈ ఋణం పొందాలంటే విద్యార్థి యొక్క కుటుంబ వార్షికాదాయం రూ. 4.50 లక్షల లోపు ఉండాలి.



సర్టిఫికెట్లు:

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ వంటి విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు

చివరిసారిగా పాసైన కోర్సుకు చెందిన సర్టిఫికెట్

చేరబోయే కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ పత్రాలు

కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం

ఈ సర్టిఫికెట్లను, పత్రాలను వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఎవరు అర్హులు:

ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించిన వారే కాకుండా నిర్ణీత శాతం మార్కులు సాధించిన వారు కూడా ఈ లోన్ కి అర్హులే.

లోన్ పొందడానికి ఏడాది పాటు చదివిన కోర్సు పాసైతే చాలు.

విద్యార్థుల అవసరాలను బట్టి ఏడాదిలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు తేదీ అంటూ ఏమీ లేదు.

దరఖాస్తు ఇలా చేసుకోండి:

విద్యాలక్ష్మి.కో.ఇన్ వెబ్ సైట్ లోకి వెళ్లి.. అప్లై నవ్ మీద క్లిక్ చేసి మీ వివరాలు పొందుపరచాలి.

తర్వాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తుని పూరించాలి.

కావాల్సిన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.

ఇతర వివరాలు:

ఒక విద్యార్థి ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలి.

అప్లికేషన్ స్టేటస్ విద్యాలక్ష్మి పోర్టల్ లో చూసుకోవచ్చు.

రుణం వస్తుందో లేదో అనేది 15 రోజుల్లో తెలిసిపోతుంది.

కొన్ని సందర్భాల్లో దరఖాస్తుని హోల్డ్ లో పెడతారు. అప్పుడు అదనంగా సమాచారాన్ని పొందుపరచడం లేదా సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం చేయాల్సి ఉంటుంది.

ఈ విషయాలను డ్యాష్ బోర్డ్ లో చూసి తెలుసుకోవచ్చు. అలానే ఋణం మంజూరైన విషయం కూడా ఇక్కడే తెలుస్తుంది.

ఋణం మంజూరయ్యాక నేరుగా విద్యార్ధి బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top