APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 825 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్స్ పోస్టులు

కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. టెక్నికల్ అసిస్టెంట్: 275 పోస్టులు

అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడీసీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 275 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

3. హెల్పర్ 275 పోస్టులు

అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 825.

వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 02-09-2023.

Download Copy

Official Website


0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top