SSC Jobs : పోలీసు ఉద్యోగాలు ఆశించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1876 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..
SSC Jobs 2023 : గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు చెందిన సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ 1876 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, దిల్లీ పోలీస్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీల్లో పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
SSC SI JOBS :
దిల్లీ పోలీసు డిపార్ట్మెంట్ - 106 పోస్టులు
బీఎస్ఎఫ్ - 113 పోస్టులు
సీఐఎస్ఎఫ్ - 630 పోస్టులు
సీఆర్పీఎఫ్ - 818 పోస్టులు
ఐటీబీపీ - 63 పోస్టులు
ఎస్ఎస్బీ - 90 పోస్టులు
విద్యార్హతలు
SSC CPO Eligibility: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పొంది ఉండాలి.
దిల్లీ పోలీసు డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రం అభ్యర్థులు కచ్చితంగా మోటార్ సైకిల్, కారుకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి.
వయోపరిమితి
SSC SI Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్లు నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు - 3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
దరఖాస్తు రుసుము
SSC CPO Application fee :
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక విధానం
SSC CPO Selection process : అభ్యర్థులను నాలుగు దశల్లో వడపోసి ఎంపిక చేస్తారు.
స్టేజ్ 1 : పేపర్ 1 - కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
స్టేజ్ 2 : ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) & ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)
స్టేజ్ 3 : పేపర్ 2 - కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
స్టేజ్ 4 : మెడికల్ ఎగ్జామినేషన్
నోట్ : పీఈటీ/పీఎస్టీ టెస్ట్‌లో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్పుట్లు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అలాగే ప్రతి తప్పు జవాబుకు 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం
SSC CPO Apply : ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
SSC CPO Important dates :
ఎస్ఎస్సీ సీపీఓ నోటిఫికేషన్ విడుదల తేదీ : 2023 జులై 21
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2023 జులై 22
దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 15
ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 17
దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 16, 17
ఎస్ఎస్సీ సీపీఓ పేపర్ 1 పరీక్ష తేదీ : 2023 అక్టోబర్ 3 నుంచి 6 వరకు
Download Complete Notification
0 comments:
Post a Comment