స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎన్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) పరీక్ష-2023కు సంబంధించి తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత టైర్-1 పరీక్షలు జులై 14న ప్రారంభమై ఇదే నెల 27 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్ -సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, సీఏ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏప్రిల్ 3 నుంచి మే 3 తేదీల్లో దరఖాస్తు చేసుకున్నారు. టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment