Second list of district court jobs released
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టు ఉద్యోగాల ఎంపికకు సంబధించి ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఏపీలోని జిల్లా కోర్టుల్లో గతేడాది 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది. నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చిలో వెల్లడయ్యాయి. మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే విధుల్లో చేరగా మిగిలిన ఖాళీల భర్తీ నేపథ్యంలో తాజాగా రెండో ఎంపిక జాబితా వెల్లడైంది. నియామకాల్లో భాగంగా వివిధ విభాగాల్లోని ఉద్యోగాలకు ప్రాధమికంగా ఎంపికైన అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలన జులై 17 నుంచి 31 వరకు జరుగనుంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్స్ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ద్రువపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు.
Results:
0 comments:
Post a Comment