Vidyadhan Scholarships విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం.

 విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం. 

సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్లు అందజేస్తుంది.

ఇప్పటివరకు విద్యాదాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిగా, రాష్ట్రాల నుంచి 6,500 మంది విద్యార్థులు లబ్దిపొందారు.

ఆంధ్రప్రదేశ్ లో 2016 విద్యాసంవత్సరం నుంచి విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఎంపికైనా విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందారు. విద్యార్థి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది.

విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్థులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం చేయడం.జరుగుతుంది.

"దయచేసి విద్యాధాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 2023 పై క్లిక్ చేసి వివరాలు"చూడగలరు":


Vidyadhan Scholarships విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం. 

ANDHRA PRADESH Intermediate Programme for 2023

స్కాలర్షిప్ వివరాలు

2023 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2024 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయల స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును. ఎవరు అర్హులు?


విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు మరియు 2022-2023 విద్యాసంవత్సరంలో 10 (SSC) పూర్తి చేసి ఇంటర్చ దువుతున్న వారు. విద్యార్థి 10th class లో కనీసం 90% లేదా 9 CGPA సాదించినవారు అర్ధులు, దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాధించినవారు

అర్హులు.ఎంపిక విధానం:

విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని Online ద్వారా పరీక్షకు /మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు email ద్వారా తెలియజేయబడుతుంది.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 15th June 2023. Online పరీక్ష తేది 02nd July 2023.

Online పరీక్ష పై తేదీల వ్యవధిలో జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేది. పరీక్ష కేంద్రం వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

సమర్పించాల్సిన పత్రాలు:

దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను

> 10 వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ మార్క్ సీట్ అందుబాటులో లేని యెదల SSC/CBSENCSE వెబ్ సైట్ పొందినది వంటి ప్రొఫెషినల్ మార్క్ సీటును అప్లోడ్ చేసుకోవచ్చు.

 > ఫోటో గ్రాఫ్ ప్రాస్పోర్ట్ సైజ్ ) 2013లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలి).

 > దివ్యాంగుల ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం ఒకవేళ విద్యార్థి దివ్యంగుడు అయితే

> 15th June 2023 లోపు మీ విద్యాధాన్ ఆన్లైన్ అప్లికేషన్ లో ఇంటర్ కాలేజీ వివరాలు, పెట్టగలరు. లేనియెడల మీ అప్లికేషన్ అంగీకరించబడదు. పైన తెలుపబడిన మొదటి మూడు పత్రాలు అప్లోడ్ చేసిన తరువాత మీ అప్లికేషన్ అంగీకరించబడుతుంది..

సంప్రదించవలసిన వివరాలు:

Email vidyadhanandhra@adfoundationindia.com or sms or whatsapp ద్వారా 8367751309/8985801376 పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు.

ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:

1. విద్యార్థి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా 5M5 ద్వారా తెలిజేడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తు పెట్టికోండి.

2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి: a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరు ను ఎంటర్ చేయాలి

b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి. c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.

d. విద్యాధాన్ Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పనీ సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాన్ అప్లికేషన్ లో login అయినప్పుడు విద్యాధాన్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాన్ password మరిచి పొయినఎడల Forgot Password ను క్లిక్ చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుంది. అ Password తో login అవ్వవచ్చు. 

3. "Apply Now " పైన క్లిక్ చేసి మీ Email కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తూంది.

4. మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Acount Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు లో Acount Activated అనే మెసేజ్ కనిపిస్తూంది. విద్యాధాన్ హెూం పేజి

5. మీ Email ID మరియు విద్యాధాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు 

6. login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి, మీ documents upload చేయాలి. 

7. మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత "Edit" పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edit చేసుకోవచ్చు

8. అప్లికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత “SUBMIT” పై క్లిక్ చేసిన తరువాత "Submission Successfully" అని చూపిస్తుంది. అంతేకాకుండా మీ documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం జరుగుతుంది.

9. దయచేసి మీ email ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు ఎందుకంటే SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.

10. విద్యార్థులు నేరుగా play store లోని విద్యార్థాన్ గాని దాచితంగా apply app గాని లేదా విద్యాదాన్ వెబ్సైటు (www.vidyadhan.org) చేసుకోవచ్చు. విద్యార్థులు ఎవరికి కూడా అప్లికేషన్ fee కట్టవలసిన అవసరం లేదు. గమనించగలరు!


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ:


ఆంధ్రప్రదేశ్- 15.06.2023.


తెలంగాణ- 20.06.2023.


➥ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 


ఆంధ్రప్రదేశ్- 02.07.2023.


తెలంగాణ- 09.07.2023.


➥ ఇంటర్వ్యూ/ పరీక్షల తేదీలు: 


ఆంధ్రప్రదేశ్: 16 - 31.07.2023 వరకు.


తెలంగాణ: 26 - 31.07.2023 వరకు.

Apply Online Application Link

Complete Notification



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top