05-02-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన ఫలితములు విడుదల చేయబడినవి. జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గానీ లేదా ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి వెబ్సైటు www.bse.ap.gov.in నందు గానీ ఫలితములు తెలుసుకొనవచ్చును. ఎంపిక అయిన విద్యార్ధుల యొక్క మెరిట్ కార్డ్ లు త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు పంపబడతాయి. జాతీయ విద్యామంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి నియమాల ప్రకారం ఎంపిక అయిన విద్యార్థులు వెంటనే ఏదయినా జాతీయ బ్యాంక్ నందు విద్యార్థి పేరున సేవింగ్స్ అకౌంటు తీసుకుని, తండ్రి లేదా తల్లిని జాయింట్ చేసుకొనవలెను మరియు విద్యార్థి ఆధార్ నెంబరును మాత్రమే అకౌంటు కు జతపరచవలెను. సేవింగ్స్ అకౌంటు కాకుండా వేరే విధమైన అకౌంట్లు సుకన్య, ఫిక్సెడ్ డిపాజిట్ మొదలగునవి) పని చేయవు. విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ మెరిట్ కార్డులో ఉన్న విధంగానే ఆధార్ కార్డ్ లోనూ, బ్యాంకు పాస్ బుక్ లోనూ ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా ఉండేలా ఏర్పాటు చేసుకొనవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.
AP NMMS Get Results with UDISE Code or Roll Number
NMMS Selection Lists ( all Districts)
0 comments:
Post a Comment