నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపిక చేయబడతారు.ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సైట్ navodaya.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 10, 2023గా నిర్ణయించబడింది.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఈ సంస్థలో మొత్తం 321 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో పీజీటీ, టీజీటీ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగంలో 12వ / గ్రాడ్యుయేషన్ / పోస్ట్-గ్రాడ్యుయేషన్ / B.Ed డిగ్రీ మరియు ఇతర అర్హతతో పాటు.. పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 50 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
ఎంపిక ఇలా..
నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పోస్టులకు అభ్యర్థులు విద్యార్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు. దీని తర్వాత అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ల కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.34,125 నుంచి రూ.35,750 వరకు జీతం ఇవ్వబడుతుంది.
దరఖాస్తు ఇలా..
Step 1: అభ్యర్థులు ముందుగా navodaya.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
Step 2: ఆపై హోమ్‌పేజీలో.. 'రిక్రూట్‌మెంట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత సంబంధిత ఖాళీ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
Step 4: దీని తర్వాత.. అభ్యర్థికి అవసరమైన ఆధారాలను నమోదు చేయండి.
Step 5: ఇప్పుడు అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను పూరించి.. పత్రాలను అప్‌లోడ్ చేయండి. తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించండి.
Step 6: దీని తర్వాత అభ్యర్థి ఫారమ్‌ను సమర్పించాలి. ఇప్పుడు అభ్యర్థి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి.. దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.
0 comments:
Post a Comment