గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశం లో చర్చించిన ముఖ్యాంశాలు
1.రోల్ తక్కువై హెచ్.ఎం.పోస్టులు కోల్పోయిన పాఠశాలల ఉపాధ్యాయుల జీతాలను ఎం.ఇ.ఓ లకు అనుసంధానం చేస్తారు.
2.హైస్కూల్ ప్లస్,రీఅపోర్షన్ వేకన్సీ పోస్టుల జీతాలను క్యాడర్ స్ట్రెంగ్త్ పూర్తి చేసి జీతాలు ఇప్పిస్తామన్నారు
3.ఎన్రోల్ మెంట్ పూర్తి అయిన తరువాత అవసరమైన చోట వర్క్ అడ్జస్ట్మెంట్ చేసి టీచర్లను ఇవ్వబడును
4.సర్ ప్లస్ ఉన్నచోటునుండి అవసరమైన చోటుకు కాంప్లెక్స్ పరిధి/ మండల పరిధి/ తరువాత పొరుగు మండల విధానంలో వర్క్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది
5.బదిలీ అయిన ప్రతి ఒక్కరినీ వారు కోరికున్న ప్లేస్ కు బదిలీ చేసి తరువాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అందరినీ రిలీవ్ చేయాలని మంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు
6.ఎం.ఇ.ఓ2లు గా వెళ్ళిన హెచ్.ఎంల స్థానాలను స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేసి,స్కూల్ అసిస్టెంట్ లను యస్.జి.టిలనుండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసి,అవసరమైన యస్.జి.టి లను MTS ద్వారా భర్తీ చేయాలనే అభిప్రాయం వచ్చినది
7.అంతర్ జిల్లా బదిలీ చేయమని కోరగా అధికారులను పరిశీలించమన్నారు
8.2003 DSC పాతపెన్షన్ పైల్ పెండింగ్ లో ఉన్నదని మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది
9.2008 DSC MTS వారిని రెగ్యులర్ చేయని మంత్రిగారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది
10.బదిలీలలో జరిగిన అవకవతవకలను సరిచేయడానికి బ్లాక్ చేసిన ఖాళీలను పరిగణనలోనికి తీసుకోవాలని కోరడం జరిగింది
11.మున్సిపల్ సర్వీసు రూల్స్ ప్రక్రియలో ఇంకా జరగాల్సిన వేగవంతం చేస్తామని అన్నారు
12. 74 రెవిన్యూ డివిజన్ లకు డి.వై.ఇ.ఓ లను ఇచ్చే ఆలోచన ఉన్నట్లు తెలియజేశారు
13. MEO1,పోస్టులు ప్రస్తుతం ఉన్న జిల్లాపరిషత్ ఎం.ఇ.ఓ లు పోను మిగిలిన 374 గవర్నమెంట్ వాళ్ళకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది
14. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 229 రోజులు పనిదినములు ఉంటాయి.ఆప్షనల్ హాలిడేస్,లోకల్ హాలిడేస్ గతంలో లాగా యధాతథంగా వాడుకోవచ్చు. కాంపన్సేటరీ అవసరం లేదు
0 comments:
Post a Comment