ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన ఏపీఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఏడాది అనంతపురం జేఎన్టీయూ నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.ఈ ఏడాది మే 15 నుంచి మే 19 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇంజనీరింగ్ పరీక్షను మే 15 నుంచి 19 వరకూ, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను మే 22 నుంచి 23 వరకు నిర్వహించారు. వీటి ఫలితాలను ఏపీ ఉన్నత విద్యామండలి cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. వీటితో పాటు పలు ఇతర వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment