Recruitment of AWW/ AWH/ Mini AWW in WDCW& DW (ICDS), Srikakulam

Recruitment of AWW/ AWH/ Mini AWW in WDCW& DW (ICDS), Srikakulam దిగువనుదహరించిన అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియామకమునకు జి.ఓ.ఎం.ఎస్.నెం 18, తే 15.05.2015 దీ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయడమైనది. ప్రభుత్వ ఉతర్వులు నెం.39, స్త్రీ శిశు మరియు వయో వృద్ధుల శాఖ, తే06.09.2011 మరియు జి.ఓ.ఎం.ఎస్.నెం.7, స్త్రీ శిశు మరియు వయో వృద్ధుల శాఖ తే 27.01.2012 దీ అనుసరించి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ, స్త్రీ శిశు సంక్షేమ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల శాఖ వారి మెమో. నెం. 1975084/prog.l/A1/2023, dt.14.05.2023 లోని ప్రభుత్వం వారి ఆమోదపు ఉత్తర్వులు అనుసరించి శ్రీకాకుళం జిల్లా లో గల ఐ..సి.డి.ఎస్. ప్రాజక్టుల నందు ఏర్పడిన ఈ దిగువ పేర్కొన్న అంగన్వాడీ కార్యకర్తల /సహాయకుల/ పోస్టుల ఖాళీలను, ప్రభుత్వము వారు రూల్ ఆఫ్ రిజెర్వేషన్ కొరకు నిర్దేశించిన కమ్యూనల్ రోస్టర్ రిజిస్టర్ అనుసరించి, ఐ.సి.డి.ఎస్.ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణించి కేటగిరిని నిర్ధారించి, సంబధిత కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేయుటకు కేటగిరీ వారీగా ప్రకటించడమైనది. కావున అర్హులైన వివాహిత మహిళా అభ్యుర్థులు, ధరఖాస్తులను తే: 18.05.2023 నుండి తే: 25.05.2023 దీ సా.5.00 గంటలలోపు సంబంధిత ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు వారి కార్యాలయమునకు అందజేయవలసినదిగా తెలియజేయబడమైనది. ఇంటర్వూ తేదీ మరియు స్థలము తరువాత తెలియజేయబడును. భర్తీ నియమ నిబంధనల కొరకు నియమ నిబంధనల ప్రతి జత చేయడమైనది. సదరు నిబంధనల ప్రకారం వచ్చిన ధరఖాస్తుదారులు మాత్రమే ఇంటర్వ్యూ నకు పిలవబడుదురు.

దిగువ ఉదహరించిన ఖాళీలు పోస్టులను 3 సార్లు సదరు రోస్టర్ పాయింట్ నోటిఫికేషన్ యివ్వడమైనది మరియు 4 వ సారి సదరు రోస్టర్ పాయింట్ మార్చి నోటిఫికేషన్ యిచ్చినప్పటికీ కూడా అర్హత గల అభ్యర్థులు లభ్యం కానందున ప్రభుత్వం వారి ఆమోదంతో ఈ సదరు రోస్టర్ పాయింట్లును ఓపెన్ కేటగిరీకి మార్చి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ మంజూరు చేయడమైనది. ఈ ఓపెన్ కేటగిరీ నందు అన్ని కులముల అభ్యర్థులు అనగా SC/ST/BC-A, B, C, D, E మరియు OC అందరూ ధరఖాస్తులు చేసుకొనవచ్చును.

అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల / మినీ అంగన్వాడీ కార్యకర్తల . కావలసిన అర్హతలు. 

> పైన వుదహరించిన పోస్టుల భర్తీ విషయములో భర్తీ చేయుటకు గాని, నిలుపుటకు గాని, రద్దు పరుచుటకు గాని నియామకపు కమిటీ ఛైర్మన్ వారికి పూర్తి అధికారము కలదని తెలియజేయడమైనది. 

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల / మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత మహిళా అభ్యుర్థుల నుండి సదరు పోస్టుల ఎంపిక కొరకు ధరఖాస్తులను ఆహ్వానించడం మైనది.

21-35 సంవత్సరముల మధ్య వయస్సు గల వారై వుండవలెను 01.07.2022 నాటికి) 

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు అభ్యర్దినులు తప్పనిసరిగా వివాహిత మహిళ లై మరియు వారి కుటుంబము సంబధిత గ్రామమునకు చెందిన వారి ఉండవలెను. తదుపరి అభ్యర్దినులు సంబంధిత గ్రామ సమ్మతి కలిగినవారై ఉండవలెను. అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు అభ్యుర్ధులు 10 వ తరగతి ఉత్తీర్ణులై వుండవలెను. స్కూల్ సర్టిఫికేట్ ఆధారంగా నియామకం జరుగును. విద్యార్హత సర్టిఫికేట్ బట్టి మాత్రమే విద్యార్హత, వయస్సు పరిగణించబడును.

అంగన్వాడీ సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై వుండవలెను.

> SC హేబిటేషన్ కు కేటాయించిన పోస్టులలో SC అభ్యుర్థులచే మాత్రమే భర్తీ చేయబడును. > ST హేబిటేషన్ కు కేటాయించిన పోస్తులలో ST అభ్యుర్థుల చే మాత్రమే భర్తీ చేయబడును.

అనగా అగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల ఎంపికలో గ్రామము స్థానికతకు ప్రాతిపదికగాను, మున్సిపాలిటి పరిధిలో వార్డును స్థానికతకు ప్రాతిపదికగా పరిగణించ బడును.

> అభ్యర్థులు ధరఖాస్తులను సంభంధిత ప్రాజక్టు కార్యాలయమునందు సంబంధిత ఐ.సి.డి.ఎస్.కార్యాలయములో పొంది పూర్తి చేసిన తదుపరి ధరఖాస్తులను అక్కడ అందజేసి రశీదును పొందవలసినదిగా తెలియ జేయడమైనది.

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులు స్థానికమైనవి. వీటికి బదిలీ నిబంధనలు వర్తించవు. అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకము పొందుటకు పై నిబంధనలతో పాటు సెలక్షన్ కమిటీ తుది నిర్ణయము ప్రకారము ఎంపికలు నిర్వహించ బడును.

కేంద్రము పోస్టు (అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల) రోస్టరు ప్రకారము ఏ కేటగిరికీ వర్తించునో భర్తీ ప్రక్రియలో ఆ కేటగిరీ వారిచే భర్తీ చేయబడును. 

> ఎస్.సి/ఎస్.టి. కేంద్రములకు మరియు ఎస్.సి/ఎస్.టి. కేటగిరికి రోస్టరు లో రిజిస్టరు కాబడిన ఎస్.సి/ఎస్.టి. పోస్టులకు 21 సంవత్సరములు నిండిన అభ్యుర్థులు లేని ఎడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా నియమించబడ వచ్చును. 

> జి.ఓ.ఎం.ఎస్.నెం.20, తే30.05.2015దీ అనుసరించి, నియమించబడిన అంగన్వాడీ కార్యకర్తలు / సహాయకులు/ మినీ అంగన్వాడీ కార్యకర్తలు 60 సంవత్సరములు నిండిన పిదప విధుల నుండి విరమించవలసి యుండును.

వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:

https://chat.whatsapp.com/LcFPFXFrfey0kCX65O6Wfw


Download Complete Notification


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top