Night Watchman Duties

Night Wstchman Duties: విద్య ఏలూరు జిల్లా యందు గల ఉన్నత పాఠశాలల యందు నూతనముగా నియామకము - కాబడిన రాత్రి కాపలాదారు (NIGHT WATCHMAN) చేయవలసిన విధులు మరియు చెల్లించబడు గౌరవ వేతనం గురించి కొన్ని ముఖ్య సూచనలు

ఆర్.సి.నెం.1/TMF/2023.తేది: 03/05/2023

సూచిక: Memo no. 2039326/ESE02-27021/2023-MDM, ది. 17/04/2023 డైరెక్టర్, MDM & SS, విజయవాడ,

ఏలూరు జిల్లా యందుగల ప్రభుత్వ, పురపాలక సంఘ, జిల్లా పరిషత్, ఆధ్వర్యములో పనిచేయుచున్న ఉన్నత పాఠశాలల యందు నూతనముగా నియమింపబడి పనిచేయుచున్న రాత్రి కాపలాదారులు (NIGHT WATCHMAN) ఈ క్రింద సూచించిన విధముగా విధులు నిర్వర్తించవలసి యున్నది కావున సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఈ విషయమై వారి పాఠశాలకు నూతనముగా నియమింపబడి పనిచేయుచున్న రాత్రి కాపలాదారునకు (NIGHT WATCHMAN) వారికి తెలియజేసి వారి సంతకం లేదా వేలిముద్ర ఈ ఉత్తర్వుల కాపీ పై తీసుకొనవలెను. సదరు ఉత్తర్వుల ప్రతిని పాఠశాల నోటీసు బోర్డు యందు అంటించవలెను.

1. రాత్రి కాపలాదారు (NIGHT WATCHMAN) సాయంత్రం పాఠశాల మూయు సమయమునకు హాజరు కావలెను. మరుగుదొడ్లు మరియు విలువ గల సామగ్రి భద్రపరుచు గదులు తాళములు వేయబడినది లేనిది గమనించుకొనవలెను.

2. మరుసటి రోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా భాద్యత గల ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన పిదప మాత్రమే రాత్రి కాపలాదారు పాఠశాల వదిలి వెళ్లలెను.

3. పాఠశాల ప్రాంగణంలోనికి (సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు) ఇతరులు ఎవరిని అనుమతించరాదు. అట్లు కాక అధికారులేవరైన వచ్చిన ఎడల ప్రధానోపాధ్యాయులకు ఫోన్ ద్వారా తెలియపరచవలెను. 

4. పాఠశాల యందు అతని డ్యూటి సమయములో అనివార్య పరిస్థితులలో ఏదేని సంఘటన (అగ్ని ప్రమాదము, దొంగతనము) జరిగినయడల వెంటనే ప్రధానోపాద్యాయులకు తెలియపరచవలెను.

5. సాయంత్ర సమయములో పాఠశాలలో పనిచేయుచున్న ఆయాలతో కలిసి మొక్కలకు నీరుపెట్టుటలో సహకరించవలెను.

6. రాత్రి సమయమందు ఏదేని పాఠశాలకు చెందిన పుస్తకములు సామగ్రి వచ్చినఎడల దానివిషయమైన ప్రధానోపాధ్యాయునికి తెలియపరచి సామగ్రి తీసుకొనవలెను.

7. అత్యవసర పరిస్థితియందు ప్రధానోపాధ్యాయుని కోరిక మేరకు ఇతర పనులుకూడ చేయవలసి యుండును. 8. రాత్రి కాపలాదారుడుకు గౌరవ వేతనము అక్షరాలా 6000/- రూ"లు యిత్నబడును.

పై విషయములన్నియు రాత్రి కాపలాదారు నిర్వహించుల ప్రధానోపాద్యాయుడు / పాఠశాల కమిటీ సభ్యులు గమనించవలెను.

Night Watchman Duties Proceeding Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top