Honorable Education Minister Garu & Unions Meeting Discussion Points. ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో జరుగుతున్న సమావేశం లో చర్చించిన ముఖ్య అంశాలు

05.05.2023 పాఠశాల విద్యాశాఖ మంత్రి వివిధ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ డైరక్టర్ కె. సురేష్ కుమార్, అడిషనల్ డైరక్టర్ పి.పార్వతి, జాయింట్ డైరక్టర్ ఎం.రామలింగం, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ తో బాటు 32 రికగ్నైజుడు, రిజిష్టర్డు సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు..

Join Our Free Latest Alerts Groups:

Whatsapp  Group Link: Click Here to Join Whatsapp Group

Telegram Group Link: Click Here to Join Telegram Group

(1) ప్రమోషన్లు : - 

292 ప్లస్ టు హైస్కూల్సులో ఇంటర్మీడియట్ విద్య బోధించడానికి 1752మందికి ప్రమోషన్లు ఇస్తారు. - పిజిటి క్యాడర్ ప్రస్తుత సర్వీస్ రూల్సులో లేదు. పోస్టులు కేటాయింపు జరిగినా, వాస్తవంగా వాటి అప్ గ్రేడేషన్ జరుగలేదు. కనుక ఈ ప్రమోషన్లు ఒక ఇంక్రిమెంట్ బెనిఫట్ అడ్ హాక్ పద్ధతిని ఇస్తారు.

- ఈ ప్రమోషన్లకు విద్యార్హతలతోబాటు సీనియార్టీని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ప్రమోషన్ పొందగోరే వారికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది.

- సబ్జెక్టు వారీగా తెలుగు - 253, ఇంగ్లీషు 253, గణితం - 196, ఫిజిక్స్ - 241, కెమిస్ట్రీ - 241, బోటనీ, - 188, జువాలజీ - 188, కామర్స్ -62, ఎకనామిక్స్-62, సివిక్స్ -62మందికి ప్రమోషన్లు లభిస్తాయి. - జిల్లాల వారీగా శ్రీకాకుళం -42, విజయనగరం-6, విశాఖపట్నం-71, తూర్పుగోదావరి - 335, పశ్చిమగోదావరి-268, కృష్ణా -260, గుంటూరు-174, ప్రకాశం-95, నెల్లూరు - 148, చిత్తూరు -236, కడప - 92, కర్నూలు, అనంతపురం- 13మందికి ప్రమోషన్లు ఇస్తారు. (2) 

(2) స్కూలు అసిస్టెంటు, హెచ్ఎం, ఎంఇఓ ప్రమోషన్లు :

- క్రొత్తగా సృష్టించిన 678 ఎంఇఓ పోస్టులు, ఖాళీగా యున్న పోస్టులతో కలిపి 1004 మందికి ఎంఇఓలుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందుగా విల్లింగ్ ఇచ్చిన హైస్కూలు హెడ్మాష్టర్లను ఎంఇఓలుగా ట్రాన్స్ఫర్ చేస్తారు. మిగిలిన ఖాళీలకు స్కూలు అసిస్టెంట్ల నుండి ప్రమోషన్ ఇస్తారు. అంటే గత సంవత్సరం ఇచ్చిన 5082 పోస్టులకు అదనంగా మరో 1000మందికి ప్రమోషన్లు ఇస్తారు. - ఖాళీ అయిన హెచ్ఎం, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు ప్రమోషన్లు ఇస్తారు. దీనికి గతంలో అనుసరించిన విధంగానే ముందస్తు ఆప్షన్ తీసుకుంటారు.

- గతంలో రిలింక్విష్ చేసి 1 సం॥ పూర్తి అయిన వారికి, గత సం॥ 70%, 30% ప్రమోషన్ల సందర్భంగా ఛాన్సు వదులుకున్న వారికి మరో అవకాశం కల్పిస్తారు.

- ప్రమోషన్కు ఆప్షను ఇచ్చిన వారిని, బదిలీలలో చివరన చేర్చి ప్లేసు కేటాయింపు చేస్తారు.

(3) బదిలీలు

వేసవి సెలవులలోనే ఉపాధ్యాయుల బదిలీలు చేపడతారు. బదిలీల చట్టం రూపొందిస్తే అసెంబ్లీ ఆమోదానికి సమయం పడుతుంది కాబట్టి, ముందుగా గత బదిలీ ఉత్తర్వులలో మార్పులు చేసి ఈ సం|| బదిలీలు నిర్వహిస్తారు. తర్వాత బదిలీ చట్టం రూపొందిస్తారు.

- బదిలీలకు గరిష్టంగా 5 సం॥లు చాలు అని 1,2 సంఘాలు వాదించినప్పటికీ, మెజార్టీ సంఘాలు 8 సం||లు ఉండాలని కోరాయి. కాబట్టి బదిలీలకు గరిష్ట పరిమితికి 8 సం|| ఉంటుంది. 

- వర్క్ అడ్జస్ట్మెంట్, 117 జిఓ అమలు లేదా మరే కారణం చేతనైనా ఉపాధ్యాయుడు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుండి పోస్టు షిఫ్టు అయితే అట్టి వారికి పూర్వం పనిచేసిన పాఠశాల స్టేషన్ పాయింట్లు ఇస్తారు. - 187 జిఓలో చేయవలసిన మార్పులు చెప్పడానికి ఉపాధ్యాయ సంఘాలకు 5 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. ఆలోగా సంఘాలు తమ అభిప్రాయాలు తెలియజేయవలసి వుంటుంది.

'ప్రభుత్వ, పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను ఎవరి మేనేజిమెంట్లకు వారిని బదిలీ చేయాలని ప్రభుత్వ ఉ పాధ్యాయులు కోరారు. అయితే ఉన్న ఖాళీలను బట్టి మాత్రమే స్వంత మేనేజిమెంట్కు వెళ్లడానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు.

(4) సబ్జెక్టు కన్వర్షన్

- రాష్ట్రంలో ఎల్ఎఫ్ఎల్ హెడ్మాష్టర్లు సుమారుగా 4,000మంది పనిచేస్తుండగా వారిలో 370మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కన్వర్షన్ ఇచ్చారు. భవిష్యత్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు ఉండే అవకాశం లేదు. కాబట్టి మరోసారి స్కూలు అసిస్టెంట్ పోస్టులకు కన్వర్షన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తారు. అయితే, స్కూలు : అసిస్టెంటుగా కన్వర్షన్ పొందిన వారికి మరల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా వెళ్లేందుకు అవకాశం లేదు. 

- ఒక సబ్జెక్టు నుండి మరొక సబ్జెక్టుకు కన్వర్షన్ పొందిన స్కూలు అసిస్టెంట్లకు మాత్రం వెనుకకు వెళ్లేందుకు ఒక అవకాశం ఇస్తారు. మరియు క్రొత్తగా కన్వర్షన్ కోరుకునే వారిని కూడా అనుమతిస్తారు.

(5) మున్సిపల్ సర్వీస్ రూల్సు :

మున్సిపల్ సర్వీసు రూల్సు డ్రాఫ్టుపై 7 సంఘాలు 21 ప్రతిపాదనలు ఇచ్చాయి. 

Download UTF Taja Samacharam


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top