We Love Reading Summer Activities
తెలివితక్కువ కోతి
ఒక మహారాజుగార్కి ఒక కోతితో ఎక్కువ చనువు ఏర్పడింది. ఆయన దానితోనే ఎక్కువ కాలక్షేపము చేస్తుండేవారు. రాజుగారంటే దానికి గూడా ఎక్కువప్రేమ. ఆయనకు ఏహానీ కలుగకుండా కంటికి రెప్పలాగ కాపాడుతుండేది. దాని అభిమానానికి మెచ్చి రాజుగారు దానికొక ఖడ్గం బహుమానంగా యిచ్చి దానినే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు.
ఒకరోజున రాజుగారు గాఢంగా నిద్రపోతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఎక్కడినుండి వచ్చిందో ఒక కందిరీగ రాజుగారి ముఖంచుట్టూ తిరుగుతూ 'ఝమ ఝమ్' అని ధ్వని చేయడం మొదలు పెట్టింది. కోతి దాన్ని చూచి చేతితో అదిలించింది. అదిపోయినట్టే పోయి మళ్ళీ వచ్చి గోల చేయసాగింది. కోతి తిరిగి దాన్ని తన జేబురుమాలుతో బయటికి తోలివేసింది. కాసేపైన తర్వాత కందిరీగ మళ్ళీ వచ్చి ఎగురుతూ రాజుగారి ముక్కుపైన కూర్చొంది. దాన్ని చూడగానే కోతికి ఎక్కడలేని కోపమూ వచ్చింది. తన కత్తితీసి ఒక్కవేటుతో ఈగని చంపివేసింది. ఈగతోబాటు రాజుగారి ముక్కు కూడా తెగిక్రిందపడింది.
రాజు బాధతో మూల్గుతూ లేచి తన తప్పువల్లే యిట్లా జరిగిందని తెలిసికొన్నాడు. కోతి ఉద్యోగాన్ని, దాని కత్తిని పీకివేసి దాన్నితోటలోకి తరిమేయమని భటులకు చెప్పారు.
నీతి :- అల్పబుద్ధి కలవారికి అధికారమీయరాదు
1,2 Classes Telugu
1,2 Classes English
1,2 Classes Maths
3,4,5 Classes Telugu
3,4,5 Classes English
0 comments:
Post a Comment