అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఓకా రోజు మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక సింహం పైన పడింది.
వెంటనే సింహానికి మేలుకో రావడంతో, కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది.అప్పుడు తెలివైన చిట్టెలుక సింహము ఉద్దేశం గ్రహించిన వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది.అడవికి మృగరాజు అయిన సింహం గర్వంతో నవ్వుతూ “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ ఎలుకను వదిలేసింది.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.
తన బలంతో ఎంత ప్రయత్నించినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. వెంటనే జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి.కొద్ది సేపటికి చిన్నగా, భయంతో ఉన్నఒక ఎలుక చెట్టువెనుకనుంచి కనిపించింది.
మెల్లిగా సింహం దగ్గరికి వచ్చిన ఎలుక, సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది.
ఎలుక చాలా సేపు కష్టపడడం తో. చివరికి వలలో పెద్ద చిల్లు తయ్యారయ్యింది.
వెంటనే సింహం వలలోంచి బయట పడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారి పోయింది.ఎలుక పారిపోవడాని గమనించిన సింహం తన మనసులో ఇలా అనుకుంది.
“ఈ చిన్న ఎలుక నాకు యెమి పనికివస్తుంది అనుకున్నాను – ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. నేను యే జంతువునీ తక్కువగా అంచనా వేయకోడదు!”
ఈ కథలోని నీతి|Moral of Story:
ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయరాదు, సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది.
1,2 Classes Telugu
గళ్ళలో యువకుడు అక్షరాలను క్రింద వర్ణమాలలో గుర్తించండి వాటికి సున్నాలు చుట్టండి. ఇచ్చిన అక్షరాలకు సున్నా చేర్చి క్రింది ఇవ్వబడిన గడుల్లో రాయండి
1,2 Classes English
క్రింది ఇవ్వబడిన పదాలను చదవండి చదివి ఆ పదాలను నోట్బుక్ లో వ్రాయండి
1,2 Maths
ఈ వృత్తాలలో ఇవ్వబడిన నెంబర్కు సరిపడా చుక్కలు వృత్తాలలో వ్రాయండి క్రింది యోగబడిన బొమ్మలను లెక్కించి ఆ బొమ్మకు సరిపడా నెంబర్ను సర్కిల్ చేయండి
3,4,5 Telugu
ఈ వర్క్ షీట్ ఇవ్వండి ఖాళీలలో ఆ బొమ్మకు చెందిన పదాన్ని రాయండి క్రింది మ్యాచింగ్ చేయండి చేసి వాక్యాలను మీ నోట్ బుక్ లో రాయండి
3,4,5 English
క్రింది ఇవ్వబడిన వర్క్ షీట్ లో మీ నోట్బుక్ నందు Matching చేయండి. క్రింది ఇవ్వబడిన Words చదివి చూడకుండా రాయండి
3,4,5 Maths
విద్యార్థులు ఈ క్రింది ఇచ్చిన వర్క్ షీట్ నందు మీ నోట్బుక్ లో నెంబర్స్ నేమ్స్ రాయండి
0 comments:
Post a Comment