BARC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన బార్క్.. 4,374 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా అణు పరిశోధనా కేంద్రం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద మరియు ట్రైనింగ్ స్కీం కింద పోస్టులను భర్తీ చేస్తారు. డీఏఈ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.  అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 24 నుంచి మే 22 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం పోస్టులు:4374

మొత్తం పోస్టుల సంఖ్య 4,374. దీనిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 212 పోస్టులను భర్తీ చేయనుండగా.. ట్రైనింగ్‌ స్కీ్ం (స్టైపెండరీ ట్రైనీ) కింద 4,162 పోస్టులను భర్తీ చేస్తారు.డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేసే పోస్టుల్లో..  టెక్నికల్ ఆఫీసర్/ సి 181 పోస్టులుసైంటిఫిక్ అసిస్టెంట్/ బి 7 పోస్టులు,  టెక్నీషియన్/ బి 24 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.56,100, ఎస్‌ఏకు రూ.35,400, టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 చెల్లిస్తారు.ట్రైనింగ్‌ స్కీం (స్టైపెండరీ ట్రైనీ) కేటగిరీ-1 1216 పోస్టులు, కేటగిరీ-2 2946 పోస్టులుఉన్నాయి. వీటికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000, కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.  బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ తదితరాలు.

అర్హతలు..

పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి

వయోపరిమితి..

మే 22, 2023 నాటికి అభ్యర్థుల యొక్క వయస్సు టెక్నికల్ ఆఫీసర్‌కు 18-35 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18-30 ఏళ్లు,  టెక్నీషియన్‌కు 18-25 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజుటీవోకు రూ.500, ఎస్‌ఏకు రూ.150, టెక్నీషియన్‌కు రూ.100, కేటగిరీ-1 పోస్టులకు రూ.150, కేటగిరీ-2 పోస్టులకు రూ.100 ఉంది. ఇక ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.ఎంపిక ప్రక్రియ ఇలా..

పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  రాత పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి, గుంటూరు , హైదరాబాద్ , కరీంనగర్ , విజయవాడ , విశాఖపట్నం .

ప్రిలిమినరీ పరీక్ష ఇలా.. 

మొత్తం 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. దీనిలో మ్యాథ్స్ లో 20, సైన్స్ లో 20, జనరల్ అవేర్ నెస్ లో 10 ప్రశ్నలను కేటాయించారు. ప్రతీ సరైన సమాధానానికి మూడు మార్కులను కేటాయించనుండగా.. ప్రతీ తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.  వీటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు అడ్వాన్స్ డ్ టెస్టు ఉంటుంది. దీని తర్వాత స్కిల్ టెస్టు ఉంటుంది.

దదరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:24.04.23

దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ:22.05.23

Official website: www.barconlineexam.com

Complete Notification: Click Here

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top