స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-2021 తుది ఫలితాలు మార్చి 24న విడుదలయ్యాయి. ఎంటీఎస్ (నాన్-టెక్నికల్), హవాల్దార్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఏప్రిల్ 6న అభ్యర్థుల మార్కుల వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల అర్హతలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. మొత్తం మూడు జాబితాల్లో ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో మొదటి జాబితా(లిస్ట్-1)లో ఎంటీఎస్ (నాన్-టెక్నికల్) ఉద్యోగాలకు, రెండో జాబితా(లిస్ట్-1)లో హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఇక మూడో జాబితాలో ఫలితాలు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల వివరాలు ఉన్నాయి.
మొత్తం 7518 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకుగాను 7494 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 3910 మంది మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు, హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) పోస్టులకు 3584 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 126 మంది అభ్యర్థుల నియామకాలకు వేర్వేరు కారణాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెండింగ్‌లో ఉంచింది.
MTS (Non-Technical) - 2021 Final Result
HAVALDAR (CBIC & CBN) - 2021 Final Result
0 comments:
Post a Comment