నిరుద్యోగులకు గుడ్​ న్యూస్.. NFCలో ఉద్యోగాలు.. వేలల్లో వేతనాలు..

నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్​ఎఫ్​సీ) 124 పోస్టులకు గాను నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఉద్యోగాలకై అప్లై చేసుకోవచ్చు.

దీని దరఖాస్తు విధానం తదితర వివరాలు మీకోసం..

నేషనల్ ఫ్యూయల్ కాంప్లెక్స్​లో​(NFC) ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. 124 పోస్టుల భర్తీకిగాను నోటిఫికేషన్​ను విడుదల చేసింది NFC. ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి NFC దరఖాస్తులను కోరుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. NFC రిక్రూట్​మెంట్​ కోసం అప్లై చేయడానికి చివరి తేది 2023, ఏప్రిల్ 10. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్​కు సంబంధించి ముఖ్యమైన తేదీలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అర్హత ప్రమాణాలు, ముఖ్యమైన తేదీల వివరాల కోసం అధికారిక వెబ్​సైట్ ​www.nfc.gov.in వెళ్లి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు

ఎన్​ఎఫ్​సీ 2023 సంవత్సరానికి గాను అధికారిక వెబ్​సైట్ @nfc.gov.inలో 124 ఖాళీల కోసం నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

ఖాళీల వివరాలు

పోస్టు పేరు పోస్టుల సంఖ్య

చీఫ్ ఫైర్ ఆఫీసర్ 01

టెక్నికల్ ఆఫీసర్ 03

డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ 02

స్టేషన్ ఆఫీసర్ 07

సబ్ ఆఫీసర్ 28

డ్రైవర్ పంప్ ఆపరేటర్ ఫైర్​మెన్ 83

మొత్తం పోస్టులు 124

వేతనాల వివరాలు

పోస్టు పేరు నెలవారి వేతనాలు

చీఫ్ ఫైర్ ఆఫీసర్ రూ.67,000

టెక్నికల్ ఆఫీసర్ రూ.56,100

డిప్యూటి చీఫ్ ఫైర్ ఆఫీసర్ రూ.56,100

స్టేషన్ ఆఫీసర్ రూ.47,600

సబ్ ఆఫీసర్ రూ.35,400

డ్రైవర్, పంప్ ఆపరేటర్, ఫైర్​మెన్ రూ.21,700

కేటగిరీ: ఇంజినీరింగ్ జాబ్స్

అధికారిక వెబ్​సైట్: www.nfc.gov.in

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదల తేది- 2023, మార్చి 11

దరఖాస్తు ప్రారంభ తేది - 2023, మార్చి 11

దరఖాస్తు చివరి తేది - 2023, ఏప్రిల్ 10

దరఖాస్తు విధానం

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ తన అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ @nfc.gov.inలో 124 ఖాళీల కోసం ఎన్​ఎఫ్​సీ రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఎన్​ఎఫ్​సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హత గల అభ్యర్థులు www.nfc.gov.in ద్వారా ఏప్రిల్10 వరకు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీకి ముందుగానే అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.

అర్హత ప్రమాణాలు

అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు బీఈ/ బీటెక్​/ ఏదేని డిగ్రీ/ డిప్లొమాను గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి

18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.

ఎంపిక విధానం

ఎన్​ఎఫ్​సీ ఉద్యోగానికి వివిధ దశలు పూర్తైన తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.

రాత పరీక్ష

స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ

డాక్యుమెంట్ వెరిఫికేషన్

మెడికల్ ఎగ్జామినేషన్

Official Website: Click Here

Complete Notification: Click Here

వివిధ రకాల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి


టెలిగ్రామ్ గ్రూప్ లింకు:




Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top