ABHA Health card Download ABHA Health card Registration ABHA card full form ABHA card benefits healthid.ndhm.gov.in registration Ayushman Bharat Health card
సెకండరీ విద్య ఏలూరు జిల్లా జిల్లాలోని అందరు ఉపాధ్యాయులు ABHA హెల్త్ కార్డు రిజిస్టర్ చేసుకోనవలసినదిగా తెలియచేయుట గురించి
సూచిక:
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం
పై సూచిక నందు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పదకం ప్రస్తుతం ABHA హెల్త్ కార్డు గా మార్చబడింది. ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది. 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది. https://healthidndhm gov.in/
పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయవలెను. మీ ఫోన్ నెంబర్ లో నమోదు తదుపరి ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి కూడా నమోదు చేస్తే మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు (ఆయుష్మాన్ ) ABHA హెల్త్ కార్డు పొందవలసిందిగా | కోరుచున్నాము. AB HA హెల్త్ కార్డు కావలిసిన వారి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండవలేను. మీ ఫోన్ నుండే సులభంగా ఆయుష్మాన్ భారత్ ABHA పథకంలో చేరవచ్చును.
రాష్ట్ర ప్రభుత్వం వారు జారి చేయబడిన హెల్త్ కార్డు ఉన్నప్పటికీ ABHA హెల్త్ కార్డు పొందవచ్చును.
భారత ప్రభుత్వం వారి ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లో చెల్లుబాటు అగును కేంద్ర ప్రభుత్వం నుండి ఉచితంగా 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది. అందరు అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు. అప్లై చేసుకున్న ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకోనవచ్చును. కేంద్ర ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య పదకమునకు సంబంధించిన పైన తేలియ చేసిన విధముగా భార్య మరియు భర్త (wife and husband) కార్డు తీసుకొనవచ్చును.
కావున జిల్లాలోని ఉపవిద్యా శాఖాధికారులు, ఏలూరు, కొయ్యలగూడెం, నూజివీడు, ఉప తనిఖీ అధికారి ఏలూరు, మరియు అందరు మండల విద్యాశాఖాధికారులు, జిల్లాలోని అందరు ప్రధానోపాధ్యాయులు పై విషయమై తమ పరిధిలో అందరికి తగు సూచనలు జారి చేసి అందరూ (ఆయుష్మాన్ ది. 18-03-2023 లోపు జిల్లాలోని ఉపాధ్యాయులందరు నమోదు చేసుకొని ABHA హెల్త్ కార్డు పొందవలసిందిగా కోరుచున్నాము.
0 comments:
Post a Comment