TSSPDCL Recruitment 2023 : దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL).. 1601 ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని సంస్థ సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఇందులో 1553 జూనియర్ లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుత రబీ సీజన్, రాబోయే ఎండాకాలంలో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్తు సంస్థలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి తాజాగా మింట్ కాంపౌండ్‌లో సమీక్ష నిర్వహించారు. ఏటా రికార్డుస్థాయిలో విద్యుత్తు డిమాండ్ నమోదవుతోందన్నారు. గతేడాది రబీ సీజన్‌లో 14160 మెగావాట్లకు చేరిందన్నారు. ఎన్నడూ లేనిరీతిలో గత డిసెంబరు 30న సైతం 14017 మెగావాట్లు నమోదవ్వడం గుర్తించాలన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాబోయే వేసవిలో 15,500 మెగావాట్ల డిమాండ్‌కు అవకాశముందన్నారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment