TS Gurukulam Jobs: తెలంగాణ గురుకులాల్లో 13,000లకు చేరనున్న ఉపాధ్యాయ పోస్టులు.. ప్రకటన విడుదలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి..

 తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య 13వేలకు పెరిగే అవకాశాలున్నాయి. కొత్తగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మరో 2,000లకు పైగా పోస్టుల్ని ఆయా సొసైటీలు గుర్తించాయి.

వీటిని కూడా త్వరలోనే జారీ చేయనున్న గురుకుల నియామక ప్రకటనల్లో భాగంగా నింపేందుకు అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే గురుకులాల్లో భర్తీ చేయనున్న పోస్టుల్లో 11,012 పోస్టులకు అనుమతులు లభించాయి. సంబంధిత నియామక ప్రకటనలు సైతం సిద్ధమయ్యాయి. కొత్తగా మంజూరయ్యే ఎస్సీ, ఎస్టీ గురుకులాల పోస్టులను కూడా కలిపి అన్నింటికీ ఒకేసారి ప్రకటనలు ఇవ్వాలని బోర్డు భావిస్తోంది.

గురుకులాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుబాటులోని 11,012 పోస్టులకు నియామక ప్రకటనలు సిద్ధం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడం వల్ల వాటికి సంబంధించిన ప్రకటనలు నిలిచిపోయాయి. కోడ్‌ ముగిసే సమయానికి ఎస్సీ, ఎస్టీ గురుకుల పోస్టులకు కూడా అనుమతులు వస్తాయి. అన్ని పోస్టులను కలిపి ఒకసారే ప్రకటనలు ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. గురుకులాల ఉద్యోగ ప్రకటనల జారీలో బ్యాక్‌లాగ్‌ నివారించేందుకు తొలుత ఉన్నత పోస్టులకు, అనంతరం కిందిస్థాయి పోస్టులకు ప్రకటనలు జారీచేయానే యోచనలో ఉంది. ఆ మేరకు భర్తీ ప్రక్రియను నియామక బోర్డు చేపట్టేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది.

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:


Job Notifications Telegram Group:


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top