New IT Deductions | ప్రతియేటా వేతన జీవులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), చిన్న వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీ రిటర్న్స్) సమర్పించాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వేతన జీవులకు రెండు రకాల ఐటీ విధానాలను అందుబాటులోకి తెచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి కొత్త ఐటీ విధానాన్ని డీఫాల్ట్ చేశారు. అంటే ఉద్యోగులు గానీ, పెన్షనర్లు గానీ పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే ఓకే. అలాగే ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితితోపాటు రాయితీలు పెంచడం ద్వారా కొన్ని మినహాయింపులనూ తీసుకొచ్చి కొత్త ఆదాయం పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త ఆదాయం పన్ను విధానంలో కల్పించిన మినహాయింపులు ఏమిటో ఓ లుక్కేద్దామా..
వేతన జీవులు, రిటైరైన పెన్షనర్లు కొత్త పన్ను పాలసీలో రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. వేతన జీవులు తమ వేతన ఆదాయం, పెన్షనర్లు తమ పెన్షన్ ఆదాయం మీద మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు. వేతన జీవులు పని చేసే సంస్థలు పన్ను లెక్క గట్టేటప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ ఆటోమేటిక్ గా పరిగణిస్తాయి కనుక ఈ తగ్గింపు కోసం స్పెషల్‌గా దరఖాస్తు చేయనవసరం లేదు.
80సీసీహెచ్ కింద డిడక్షన్ ఇలా
అగ్నిపథ్ స్కీమ్ 2022' కింద నమోదైన వ్యక్తులు 'అగ్నివీర్ కార్పస్ ఫండ్'లో డిపాజిట్ చేసే మొత్తంపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీహెచ్ సెక్షన్ కింద పన్ను రాయితీ ప్రతిపాదించారు. అగ్నిపథ్ స్కీంలో 2022 నవంబర్ ఒకటో తేదీ తర్వాత పేర్లు నమోదు చేసుకున్న వారు పన్ను తగ్గింపు పొందేందుకు అర్హులు. ఆదాయం పన్ను విభాగం తెలిపిన వివరాల ప్రకారం అగ్నివీర్ కార్పస్ ఫండ్ కోసం చేసిన విరాళాలకు సమానంగా పన్ను డిడక్షన్ పొందొచ్చు. ఈ మినహాయింపు పాత లేదా కొత్త ఐటీ విధానంలోనూ అమలవుతున్నది. అగ్నిపథ్ స్కీం సభ్యుల, అగ్నివీర్ కార్పస్ ఫండ్ ఖాతాకు కేంద్ర సహకారాన్ని జీతం (సెక్షన్ 17 ప్రకారం)గా పరిగణిస్తారు. సెక్షన్ 80సీసీహెచ్ కింద దీని డిడక్షన్ క్లయిమ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తారు.
80సీసీడీ (2) సెక్షన్ కింద ఇలా క్లయిమ్ చేయొచ్చు
ఉద్యోగుల నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) ఖాతాకు ఆ ఉద్యోగి యాజమాన్యం అందించే సహకారంపై కొత్త పన్ను పాలసీలో టాక్స్ డిడక్షన్ క్లయిమ్ చేసుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (2) సెక్షన్ ఇందుకు అనుమతి ఇస్తుంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల కనీస వేతనం ప్లస్ డీఏ మొత్తంలో గరిష్టంగా 10 శాతం.. అందుకు సమానమైన మొత్తం పన్ను మినహాయింపు కోరవచ్చు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 14 శాతం వరకు మినహాయింపు అవకాశం కల్పించారు. దీని గరిష్ట పరిమితి రూ.7.50 లక్షలు. సాధారణంగా ఎన్పీఎస్‌లో కంట్రీబ్యూషన్ మీద 80సీ సెక్షన్ కింద (ఇతర స్కీంలతో కలిపి) రూ.1.50 లక్సల వరకు, సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50 వేల వరకు డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. కానీ కొత్త ఐటీ పాలసీలో ఈ మినహాయింపులను అనుమతించడం లేదు
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీపై ఇలా డిడక్షన్
అధికాదాయం గల వారు ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవడానికి ఇష్టపడరు. దీనికి ఆయా పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు వర్తించకపోవడమే. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి యూలిప్స్ మెచ్యూరిటీ రాబడిపై కేంద్రం కొన్ని పరిమితులు తీసుకొచ్చింది. రూ.2.50 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించే పాలసీల మెచ్యూరిటీతో వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. 2021 ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత కొనుగోలు చేసిన పాలసీలకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఇక 2023 బడ్జెట్‌లో సంప్రదాయ నాన్- యూలివప్ పాలసీలు, ఎక్కువగా ఎండోమెంట్ పాలసీలకు పరిమితి విధించారు. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత కొనుగోలు చేసే పాలసీల మొత్తం ప్రీమియంల విలువ రూ.5 లక్షలు దాటితే.. ఆయా పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై పన్ను చెల్లించాల్సిందే. ఒకవేళ పాలసీదారులు మరణిస్తే.. కుటుంబ సభ్యులు అందుకునే బెనిఫిట్ మీద ఏ పన్ను విధానంలోనూ ఆదాయం పన్ను అమలు కాదు.
హోం రెంట్ మీద స్టాండర్డ్ డిడక్షన్
ఇంటి అద్దె ద్వారా మీరు ఆదాయం పొందుతున్నట్లయితే ఏడాది విలువ (అసలు అద్దె / మార్కెట్ రేట్ల ప్రకారం అద్దె) పై 30 శాతం వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే మొత్తం అద్దె ఆదాయం నుంచి చెల్లించిన ఆస్తి పన్ను ఇతర మున్సిపల్ పన్నులు తీసేసి వార్షిక విలువ గణిస్తారు. ఇక పీపుల్స్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో పొదుపు డిపాజిట్లపై కొత్త పన్ను విధానంలో పన్ను పే చేయనక్కర్లేదు. కానీ పెట్టుబడులు పెడితే మాత్రం డిడక్షన్ క్లయిమ్ చేయడం సాధ్యం కాదు.
0 comments:
Post a Comment