Income tax (preparing IT Calculation, FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...

Income tax (preparing IT Calculation,  FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...

1. PAN no. మరియ పేరు సరిగా ఉండాలి 

2.) E-FILING పోర్టల్ నుండి AIR లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి FD, saving Bank account interest (10వేల వరకు మినహాయింపు ఉంటుంది). 

  3.) 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయింద లేదా చెక్ చేసుకోవాలి,  ఒక వేళ credit అయితే ఆ amount ని Advance tax కింద చూపించి మిగిలిన బాలన్స్ ని tax pay చేయాలి. 

 4.) DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి. 

 5.) House loan ,  joint account ఉంటే 50-50 share చేసుకోవాలి.  లేక పోతే 25-75 చేసుకోవాలి. 

 6.) ఇదే సూత్రం interest మరియు principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి. 

7.) ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ కూడా 80C పరిధిలో ఉంటుంది.  

8.) NPS state government employee అయితే proof అవసరం లేదు,  అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి. 

9.) EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి. 

10.) Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents latest ఇవ్వాలి.. 

11.) ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి.  దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ. 

12.) EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి.., 

13.) ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి..  

14.) Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి.  తద్వారా online Form-16. Generate అవుతుంది.  మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి.  ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది. 

15.) E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి.  ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి.తేడా tax కొరకు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top