సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) - డిసెంబర్ 2022 ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఫిబ్రవరి 14న విడుదలైంది.అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. సీటెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్సైట్లో ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసి కీని చూసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. కీపై అభ్యంతరాలు ఉంటే ప్రశ్నకు రూ.1000 రుసుము చొప్పున ఫిబ్రవరి 17లోగా నిర్ణీత నమూనా ప్రకారం తెలియజేయాల్సి ఉంటుంది
కంప్యూటర్ ఆధారిత (ఆన్లైన్) విధానంలో ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో గత డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరిగిన విషయం తెలిసిందే. సీటెట్ పరీక్ష కోసం 32.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు అధికారులు అంచనావేస్తున్నారు. మొత్తం 74 నగరాల్లోని 243 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్ష నిర్వహించారు.
ఆన్సర్ కీ ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్-1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. - https://ctet.nic.in/
స్టెప్-2: అక్కడ హోంపేజీలో ఆక్టివిటీ అనే ఆప్షన్లో లాగిన్పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: అక్కడ కనిపించే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
స్టెప్-4: తర్వాత సైన్ ఇన్ పై క్లిక్ చేసి.. ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలి.
స్టెప్-5: మెయిన్ వెబ్సైట్లో స్క్రీన్ పై కనిపిస్తున్న ప్రాథమిక కీ ని డౌన్లోడ్ చేసుకోవాలి.
స్టెప్-6: ఆన్సర్ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లింక్ ద్వారా తెలియజేయాలి.
0 comments:
Post a Comment