గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి మూడో వీడియోలోని సందేశం

 గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి మూడో వీడియోలోని సందేశం

ఈ వీడియోలో రెండు అంశాలు కలవు

1. విధి నిర్వహణకు సంబంధించి,

2. డిజిటల్ ఎడ్యుకేషన్, నేను ఉపాధ్యాయుల పనితీరులో పాఠశాలలో గమనించినటువంటి అంశాలు:

1. సిలబస్ పూర్తి చేయకపోవటం,

2. సిలబస్ పూర్తి చేసి క్లాస్ వర్క్ పూర్తి చేయకపోవడం, 

3. సిలబస్ పూర్తి చేసి క్లాస్ వర్క్ పూర్తి చేసి నోట్ బుక్స్ కరెక్షన్ చేయకపోవడం,

4. సిలబస్ పూర్తి చేసి క్లాస్ వర్క్ పూర్తి చేసి కరెక్షన్ వర్క్ మెకానికల్ గా చేయడం యాంత్రికంగా

టిక్కులు పెట్టడం తప్పులను సరిచేయకపోవడం, ఉపాధ్యాయుల కరెక్షన్ వర్క్ లో క్వాలిటీ లేకపోవడం.పరిశీలనలో తెలిసినది. 

మడకశిరలో పనిచేస్తున్న ఎన్డీటీ శోభా రాణి గారు అంకితభావంతో పనిచేసినట్లు శోభారాణి వంటి అంకిత భావం గల ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కావాలి.

క్వాలిటీ ఆఫ్ కరేక్షన్ వర్క్ లో నా సూచనలు:-

1. ప్రతిరోజు కొన్ని నోట్స్ లు దిద్దాలి. వారానికి నెలకే కాకుండా ప్రతిరోజు విద్యార్థుల యొక్క తప్పులను సరిదిద్దాలి, కరెక్షన్ చేయాలి.

2. ఉపాధ్యాయులు అధికారుల పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు..

3. ఎవరి స్థాయిలో వారు హార్డ్ worked గా ఉండాలి, RJDSE, DEO, DYEO, MEO, HM, TEACHERS. అందరూ తమ ధర్మాన్ని నిర్వర్తించాలి.

4. ప్రిన్సిపల్ సెక్రెటరీగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. 

5. దీనిలో ఎటువంటి పబ్లిసిటీకి అవకాశం లేదు. దయచేసి అర్ధం చేసుకుని సహకరించండి.విద్యా శాఖ యొక్క ప్రధాన కేంద్రం / లక్ష్యం ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగే అభ్యసన ప్రక్రియ. Components of best policy(As per the best professor of the Masters in Public policy): Minimum gap between policy and implementation. మనం అందరం policy ఆచరణకు మధ్య ఉన్న అంతరాన్ని క్షేత్ర స్థాయిలో సాధ్యమైనంతగా తగ్గించాలి.

6. ప్రభుత్వం కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాన్ని క్రింది స్థాయి వరకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత మనందరి పై ఉన్నది.

7. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖకు రాయబారిని, సంధానకర్తను, నాయకుడను, చాంపియన్ ను.

8. ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత పి. ఎస్ గా నాపై ఉన్నది. అదే నా ధర్మం నా బాధ్యత.

9. అందరిలో పాజిటివ్ థింకింగ్ రావాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గ్యాప్ రాకూడదు. అందరూ సమన్వయంతో పని చేయాలి. లేకపోతే ప్రభుత్వ పథకాలు నీరుగారి పోతాయి..

సమస్యకు మూలాలు:-

లీనియర్ దింకింగ్ లేకపోవడం మరియు looking the work in different dimensions, పనిచేయడం లో మల్టీ టాస్కింగ్.....ఎందుకుచేయాలి...చెయ్యకపోతే ఏమి అవుతుంది...లాంటి వ్యతిరేక ...వానిని విడనాడాలి. సకారత్మక దృక్పధం తో ముందుకు వెళ్లాలి.

రెండో అంశము డిజిటల్ ఎడ్యుకేషన్:-

ప్రభుత్వం కోట్ల రూపాయలతో 8వ తరగతి విద్యార్థులకు బాబ్స్ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఇందుకోసం 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం..

టాబ్స్ యూసిజ్ సక్రమంగా లేకపోవడం గమనించడం జరిగింది.

1. జిల్లా స్థాయి అధికారులకు ప్రధానోపాద్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ ట్యాబ్ ఏ విధంగా ఉపయోగించాలి అని తెలిసి ఉండాలి.

 2. మనకే ట్యాబ్ ఉపయోగించడం ప్రావీణ్యం లేకపోతే విద్యార్ధులకు ఎలా చెప్పగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరికి టెక్నాలజీ పై అవగాహన ఉండాలి. ఈ ప్రభుత్వ ఉద్దేశం నెరవేరాలి. 

3. అధికారులు కానీ కొంతమంది టీచర్లు అసలు ఒక్క సారం కూడా వీడియో కూడా చూడలేదు..శ్రీనివాస్ మాస్టారు, పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల, గుడివాడ, అభినందనీయుడు. టైజస్ యాప్ నందు ఉన్న సంబంధిత సబ్జెక్ట్ కంటెంట్ ను పూర్తిగా చూడడం జరిగింది అని చెప్పారు. శ్రీనివాస్ లాంటి ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కావాలి మనకు..

4, దయచేసి FA-4, 5A-2, టైజూస్ పాఠాలు విద్యార్థులు కు అందించవలసిందిగా సూచించడం అయింది. 

5. దయచేసి అందరూ మూడు వీడియోలు చూసి దానిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన కార్యక్రమాలు తెలుసుకొని విద్యార్ధులను నేర్చుకోవడం ప్రక్రియలో 

ప్రోత్సహించ వలసినదిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top