గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి రెండవ వీడియోలోని ముఖ్య అంశములు...
అభ్యసన ప్రక్రియలలో transaction అనేది ప్రధాన అంశము. ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మధ్యన ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలి దీనిలోని ముఖ్యాంశములు....
1. సిలబస్:- తగిన సమయానికి సిలబస్ పూర్తి చేయబడాలి. విద్యా సంవత్సరంలోని 220 రోజులకు గాను ఈ ప్రణాళిక సక్రమంగా అమలు జరగాలి.
2.Notes by Students:- విద్యార్థులు రాసుకున్న పుస్తకాలను ఉపాధ్యాయులు ప్రతి పదాన్ని చదివి తప్పులను సరి చేయాలి ఒకటి నుండి 5వ తరగతి వరకు Work Books ఇవ్వబడ్డాయి. వీరికి నోట్ బుక్స్ లేవు ఎందుకంటే వర్క్ బుక్ నే నోట్ బుక్స్ గా పరిగణించాలి. నేను కొన్ని పాఠశాలలు సందర్శించినప్పుడు సిలబస్ విషయంలోనూ మరియు నోట్ బుక్స్ లేదా వర్క్ బుక్స్ కరెక్షన్ విషయంలో చాలా విషయాలు గమనించాను సిలబస్ పూర్తి చేయని ఉపాధ్యాయులను వర్క్ బుక్స్ ను కరెక్ట్ చేయని ఉపాధ్యాయులను చాలామందిని గమనించాను కొన్ని పాఠశాలలలో కనీసం ఒక్క పేజీని కూడా రాయించని పరిస్థితి గమనించాను. ఈ విషయంలో సూపర్వైజింగ్ అధికారులు నా విజిట్ నందు ప్రశ్నించబడతారు.
ఈ అంశాలను సక్రమంగా నెరవేర్చకపోతే ట్రాన్సాక్షన్ అనే ప్రక్రియ కుంటుపడుతుంది. ఉన్నత పాఠశాలల యందు 6 నుండి 10వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ లు విద్యార్ధుల పట్ల ఖచ్చితమైన శ్రద్ధ వహించాలి దీనిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలి.
రెండు ముఖ్యమైన అంశాలు తప్పనిసరిగా ఉండాలి 1. ఇంటరాక్టివ్ ప్లాగ్ ప్యానల్ 2. టైజూస్ కంటెంట్.. 8 నుండి 10వ తరగతి వరకు
ఇంటరాక్టివ్ ఫ్లాగ్ ప్యానెల్ లో అధికారులు క్రింది స్థాయి అధికారులతో మరియు ఉపాద్యాయులతో పాఠశాల విజిట్ సందర్భంగా చర్చించి ప్రణాళికలు సక్రమంగా అమలు అయ్యే విధంగా బాధ్యత తీసుకోవాలి సమస్యలు పరిష్కరించాలి.కంటెంట్ కు సంబంధించి ప్రతి ఉపాధ్యాయుడు బైజుస్ కంటెంట్ను తరచుగా చూసి రాబోయే విద్యా సంవత్సరానికి అనగా 2023 2024 విద్యాసంవత్సరానికి విద్యా వార్షిక ప్రణాళికలు బైజుస్ కంటెంట్కు అనుగుణంగా తయారు చేయాలి..
ప్రధానోపాధ్యాయులు కోడిగుడ్లు చిక్కిలు మొదలైన వాటి విషయంలో ఏదైనా తేడా ఉంటే యాప్ నందు టికెట్ రైజ్ చేయాలి..
క్వాలిటీ మరియు మెయింటెనెన్స్ ఈ రెండు విషయాలు అమలు అయ్యేలా చూడటం పంపిణీ చేయు అధికారుల యొక్క బాద్యత వీటిలో ఏదైనా తేడా ఉన్న ఎడల టికెట్ రైజ్ చేయవచ్చును. దీనికి సంబంధించి డీఈవో డిప్యూటీ ఈవో, ఎంఈఓ, ఇంజనీర్లు, వెల్ఫేర్ కార్పొరేషన్ సిబ్బంది బాధ్యులుగా పరిగణించబడతారు.
పై విషయాలను సక్రమంగా అమలు చేసి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
ప్రవీణ్ ప్రకాష్
0 comments:
Post a Comment