AP EMRS Ekalvya Model Residential Schools Admissions 2023 Notification Apply Online

AP EMRS Ekalvya Schools Admissions 2023 Apply Online AP EMRS Ekalvya Model Residential Schools Admissions 2023 Notification Apply Online APTWREI SOCIETY GURUKULAM - Ekalavya Model Residential Schools EMRS 6th Class Admission Notification 2023 for AP EMRS CET 2023 APGPCET 2023 ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తాడేపల్లి, గుంటూరు జిల్లా)


AP EMRS Ekalvya Model Residential Schools Admissions 2023 Notification Apply Online

ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 2023-2024 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకొనే విద్యార్ధులకు ప్రాధమిక సమాచారం.

Rc.No.APTWRE-13021/14/2023, Dted.23/02/2023

2023-2024 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకులం ఆధ్వర్యంలో నడుపబడుతున్న (28) ఏకలవ్య మోడల్స్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో గల 60 సీట్లను మరియు 7వ, 8వ, 9వ తరగతులలో గల మిగిలిన ఖాళీలను నింపడానికి అర్హులైన విద్యార్ధిని మరియు విద్యార్ధుల నుండి ఆన్లైన్ ద్వార దరఖాస్తులు కోరబడుతున్నవి. 

2.ఈ సీట్లు అన్ని వ్రాత పరీక్ష నందు పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం.ప్రవేశములు కల్పించడం జరుగుతుంది. 

3.6వ తరగతిలో గల 60 సీట్లను 30 బాలురకు, 30 బాలికలకు ఈ క్రింది ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో గలవు.

4.విద్యార్ధుల వయస్సు తరగతివారిగా 31-03-2023 నాటికి ఈ దిగువ పేర్కొన్న విధంగా ఉండవలెను. (ఏప్రిల్ 1 తేది కూడా పరిగణించబడుతుంది).

6వ తరగతి

10 సంవత్సరాలు నిండి 13 సంవత్సరాల లోపు ఉండవలెను..

7వ తరగతి

11 సంవత్సరాలు నిండి 14 సంవత్సరాల లోపు ఉండవలెను.

8వ తరగతి

12 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు ఉండవలెను.

9వ తరగతి

13 సంవత్సరాలు నిండి 16 సంవత్సరాల లోపు ఉండవలెను.

10వ తరగతి

14 సంవత్సరాలు నిండి 17 సంవత్సరాల లోపు ఉండవలెను.

4.6వ తరగతిలో ప్రవేశం కోరుకొనే బాల బాలికలు 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలులో చదివి ఉండాలి లేదా విద్యా హక్కు చట్టం 2009. నందు సెక్షన్ 4 ప్రకారం విద్యార్థి ఇంటివద్దనే 5వ తరగతి చదివిన వారు కూడా అర్హులు. ఐతే విద్యార్ధి యొక్క తల్లిదండ్రులు / సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. 

5.ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో విద్యా బోధనా అంతా ఇంగ్లీష్ మీడియంలో మరియు సి.బి.ఎస్.ఇ సిలబస్ లో ఉంటుంది.

6.తెలుగు మీడియం లో చదివిన విద్యార్ధులు కూడా వ్రాత పరీక్షకు అర్హులు.

7. రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులందరికీ నిర్దిష్ట రిజర్వేషన్ లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్ధికి సంబంధించిన జిల్లాలో ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా సమీపంలో గల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చును. ఆయనపటికి ప్రతి ఏకలవ్య గురుకుల విద్యాలయం నందు గల సీట్లలో 30 శాతం సీట్లు మెరిట్ ఆధారంగా స్థానిక జిల్లా, తాలుకా, మండలం వారికి మెరిట్ ఆధారంగా ఇవ్వబడతాయి.

8. 6వ తరగతిలో గల మొత్తం 60 సీట్లలో (1) (48) సీట్లు గిరిజన బాల బాలికలకు, (ii) (3) సీట్లు ఆదివాసి గిరిజనులకు, (iii) (3) సీట్లు డి. నోటిఫైడ్ ట్రైబ్ / సంచార గిరిజనులకు / పాక్షిక సంచార గిరిజనులకు, (iv) మిగిలిన (6) సీట్లు తీవ్రవాదుల దాడులలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్ధులకు, ప్రాణాలు కోల్పోయిన పోలీస్, పేరా మిలటరీ, సాయుధ దళా సిబ్బంది యొక్క విద్యార్థులకు కోవిడ్ వలన తల్లిదండ్రులని కోల్పోయిన విద్యార్ధులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంరక్షణలో గల విద్యార్ధులకు, అనాధ విద్యార్ధులకు, విద్యాలయానికి భూమి ఉచితంగా ఇచ్చిన దాతల పిల్లలకు కేటాయించబడ్డాయి. ఇవి కూడా వ్రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఈసీట్లకు గిరిజన విద్యార్ధులే. కాకుండా అందరు దరఖాస్తు చేసుకోవచ్చును.

 9.మొత్తం (60) సీట్లలో 5 % అనగా (3) సీట్లలో విభిన్న సామర్థ్యం ( Differently abled) గల ST విద్యార్థులకు (2) సీట్లు, ఇతరులకు (1) సీటు కేటాయించడం జరిగింది.

10. విద్యార్ధులు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించినప్పుడు ఈ దిగువ పేర్కొన్న ధృవీకరణ పత్రాలను తీసుకురావలెను.

(అ) విద్యార్ధి మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు, (ఆ) కుల ధృవీకరణ పత్రం, (ఇ) నివాసస్థల ధృవీకరణ పత్రం, (ఈ) రేషన్ కార్డ్, (ఉ) దివ్యాంగులైన విద్యార్ధులు సంబంధిత ధృవీకరణ పత్రం, (ఊ) పైన 11వ పాయింట్ నందు చెప్పిన కేటగిరీలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలు, (ఎ) స్టడీ సర్టిఫికేట్, (ఏ) పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, (ఐ) జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొన్న ధృవీకరణ పత్రం (తప్పనిసరి కాదు), (ఒ) పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 2.

11. వార్షిక ఆదాయం : తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,00,000/- దాటకుండా ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వారు (G.O.Ms.No.229, Dated.23.06.2017) ప్రకారం ఆదాయ పత్రం పెట్టనవసరం లేదు.

12. విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించినప్పుడు ప్రాధాన్యతా క్రమంలో ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో చేరదలచుకున్నారో 28 ప్రాధాన్యతలు నింపవలసి ఉంటుంది. ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి మరియు వ్రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమె ప్రవేశం..కల్పించబడుతుంది.

13. వ్రాత పరీక్ష 6వ తరగతికి 100 మార్కులకు, 7వ, 8వ & 9వ తరగతులకు 200 మార్కులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

Note : కొత్త జిల్లాలు : విజయనగరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల అభ్యర్థులు తమ సమీప పరీక్ష కేంద్రాని ఎంచుకోవాలి. విద్యార్థులు తమకు సమీపంలో ఉండే ఏవైనా (3) పరీక్షా కేంద్రాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవచ్చు. 17. వ్రాత పరీక్ష తేది: 30.04.2023 ఉదయం 11.30 నుండి

Schedule for admissions:


Issue of Notification in Telugu Daily News paperDownloading of hall tickets in web site : 25-02-2023

Last date for Receipt of applications:

15-04-2023

Conduct of Entrance Test (Sunday)

30-04-2023

Preparation of Merit as per test mark Merit basis.

10-05-202

The list of selected students will be kept on the notice board at the examination center and in:website: 17-05-2023

Dispatch of call letters for selected students:

17-05-23

Date of Admissions and counseling date: According to the Govt., orders


EMS Admission Notification

EMS Online Application


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top