AP CM Jaganmohan Reddy: విద్యా శాఖపై సీఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు.
స్కూళ్లలో నాడు నేడు, నూతన విద్యా విధానం అమలు, బైజూస్ కంటెంట్- ట్యాబ్‌ల ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నారు.
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించనున్నారు. విద్యా వ్యవస్థలోని పలు పథకాల అమలు తీరుతో పాటు రాబోయే రోజుల్లో నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలపైనా కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది
0 comments:
Post a Comment