మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023 -24 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశం కొరకు సమాచారం.
1. మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బి.సి. బాలబాలికల పాఠశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) స్టేట్ సిలబస్ బిసి, ఎస్సీ, ఎస్టీ, మరియు ఇ.బి.సి అభ్యర్ధుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేది నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 వరకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులననుసరించి, ఆయా MJP పాఠశాలల్లో పరీక్ష నిర్వహించబడును.
2. పరీక్ష కొరకు అర్హత:
వయస్సు: బిసి, ఇ.బి సి మరియు ఇతర విద్యార్ధులు, 9 నుండి 11 సంవత్సరాల వయస్సు మించి ఉండరాదు. వీరు 01.09.2012 మరియు 31.08 2014 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 9 నుండి 13 సంవత్సరాల వయస్సు మించి ఉండరాదు. వీరు 01.09.2010 మరియు 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.. ఆదాయ పరిమితి: విద్యార్ధుల తల్లితండ్రుల/ సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ.1,00,000/- కు మించరాదు.
జిల్లాలోని గురుకుల పాఠశాలలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో గత రెండు సంవత్సరాల నుండి నిరంతరంగా (2021-22, 2022-23) చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 4వ తరగతి 2022-23 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి..
3. పాఠశాలలలో ప్రవేశం:
విద్యార్ధుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది. పట్టిక - 1 లో ఆయా జిల్లాలకు సీట్ల కేటాయింపు వివరాలు పొందుపరచడమైనవి.
0 comments:
Post a Comment