ఫిలిప్స్ సంస్థ కూడా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి రూ.50వేలు స్కాలర్‌షిప్ అందించనుంది.అందుకోసం ఫిలిప్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం- 2022-23 కింద అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. అర్హులు ఎవరు, అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి, చివరి తేదీ తదితర విషయాలు వివరంగా తెలుసుకుందాం.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. :
వైద్య, ఆరోగ్య సంబంధింత రంగాల్లో చదువుతున్న వారికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు. అంటే MBBS, BDS, Nursing, B.Pharmsy, BAMS, BHMS తదితర ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కోర్సులు చదువుతున్న వారు ఫిలిప్స్ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు.పైన పేర్కొన్న కోర్సులు చేస్తున్న వాళ్లల్లో ఏ సంవత్సరం చదువుతున్న వారైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కడ చదువుతున్న వారైనా ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులే. అయితే అభ్యర్థికి ఇంటర్ (12వ తరగతి)లో తప్పనిసరిగా 70 % శాతం మార్కులు దాటాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. ఫిలిప్స్, బడ్డీ ఫర్ స్టడీ (Buddy4Study) సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు దీనికి అర్హులు కాదు.
అవసరమైన డాక్యుమెంట్లు : ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోడానికి కొన్ని డాక్యుమెంట్లు కావాలి. ఇంటర్ (12వ తరగతి) మార్క్‌షీట్ ఉండాలి. ప్రస్తుతం చదువుతున్న కోర్సుకు సంబంధించి ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. అంటే కాలేజీలో చదువుతున్నట్లు ఇచ్చే అడ్మిషన్ లెటర్, స్టూడెంట్ ఐడెంటిటీ కార్డు, బోనఫైడ్ సర్టిఫికేట్, ఫీజు రసీదు లాంటివి ఏదైనా జత చేయాలి
వీటితో పాటు భారత ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు అంటే ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ల్లో ఏదైనా ఒకటి అవసరం. అలాగే కుటుంబానికి సంబంధించిన వార్షిక ఆదాయ ధ్రువపత్రం కూడా అవసరమే. దీని కోసం మీరు ఫారం-16ఏ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదాయ ధ్రువపత్రం లేదా వేతన రశీదు (సాలరీ స్లిప్)ల్లో ఏదైనా ఒకటి సరిపోతుంది. దరఖాస్తు చేస్తే స్టూడెంట్ పేరు మీద బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ తాలూకా పాస్‌బుక్ కాపీ, క్యాన్సిల్ చేసిన చెక్‌తో పాటు పాస్‌పోర్ట్ ఫొటో ఒకటి జత చేయాలి.
0 comments:
Post a Comment