LIC Jeevan Arogya Policy : ప్రస్తుతం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలేనిది ఒక్కటే ఆరోగ్యం. ఒక్కసారి అనారోగ్యం పాలు అయ్యామంటే మళ్లీ మళ్లీ ఏదో ఒక రకంగా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి.
అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు లక్షలకు లక్షలు ఆస్పత్రులకు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ధనవంతులకైతే ఫర్వాలేదు.. కానీ సాధారణ ప్రజలు మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి వారికోసం మార్కెట్లో ఎన్నో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పలు రకాల ప్లాన్లను అందుబాటులో ఉంచాయి. అవే కాకుండా ఎల్ ఐసీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొచ్చిన విషయం తెలుసుకోవాల్సిందే.
ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ కస్టమర్ల కోసం, అలానే కొత్తవారి కోసం ఎల్ఐసీ ఎప్పటికప్పుడు ఎన్నో పాలసీలను ప్రారంభిస్తుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు పొందే విధంగా అనేక రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు ఆరోగ్యం కోసం ఎల్ ఐసీ సంస్థ అందిస్తోన్న పాలసీల్లో 'జీవన్ ఆరోగ్య పాలసీ' ఒకటి. ఈ పాలసీలో చేరిన కుటుంబానికి ఓ హెల్త్ కార్డు ఇస్తారు. దాని ద్వారా ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు 24 గంటలపైన ఆసుపత్రిలో పొందే వైద్యంపై ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం రాదు. అయితే మనం తీసుకునే ప్రీమియం బట్టి.. ఈ పాలసీ బెనిఫిట్స్ ఉంటాయి. కాగా, ఎల్‌ఐసీ తీసుకువచ్చిన ఈ పాలసీతో మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఒక్క పాలసీతో కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా వర్తిస్తుంది. ఈ పాలసీని 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు తీసుకోవచ్చు. అదే విధంగా పిల్లల విషయానికి వస్తే.. 25 ఏళ్ల వరకు, పెద్దలకు 80 ఏళ్లు వచ్చే వరకు పాలసీ వర్తిస్తుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ లేదా సమీపంలో ఉన్న ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు.
0 comments:
Post a Comment